అయ్య‌య్యో..సాయి ప‌ల్ల‌విని మ‌హేష్ అలా అనేశాడేంటి?!

సాయి ప‌ల్ల‌వి బాడీలో ఎముక‌లు ఉన్నాయా..? అని అనేశాడు మ‌హేష్‌. అస‌లు ఎందుకు ఆమెను అలా అన్నాడు..? దాని వెన‌క కార‌ణం ఏంటీ..? అన్న విష‌యాలు తెలియాలంటే లేట్ చేయ‌కుండా మ్యాట‌ర్‌లోకి వెళ్లాల్సిందే. నాగ చైతన్య అక్కినేని, సాయి పల్లవి జంట‌గా శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన తాజా చిత్రం `ల‌వ్ స్టోరీ`.

Sai Pallavi Fan ❤️ on Twitter: "Dancing Queen ?? @Sai_Pallavi92  #SaiPallavi #LoveStoryOnApril16th #LoveStory #EvoEvoKalale… "

భారీ అంచ‌నాలు న‌డుము శుక్ర‌వారం విడుద‌లైన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. ప‌లువురు సెల‌బ్రిటీలు సైతం సినిమాపై ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. తాజాగా సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు కూడా ల‌వ్‌స్టోరీపై త‌న‌దైన శైలిలో రివ్యూ ఇచ్చారు. శేఖ‌ర్ క‌మ్ముల చిత్రాన్ని బాగా తెర‌కెక్కించాడ‌ని ప్ర‌శంస‌లు కురిపిస్తూ.. చైతూ న‌టుడిగా చాలా ఎదిగాడ‌ని, ఇది చైత్య‌న్య కెరీర్‌ను మ‌లుపుతిప్పే సినిమా అవుతుంద‌ని కొనియాడారు.

Love Story Telugu Movie Review - Socially Relevant

ఈ క్ర‌మంలోనే సాయి ప‌ల్ల‌వి గురించి ప్ర‌స్తావిస్తూ.. ఆమె స్క్రీన్‌పై మ్యాజిక్ చేసింద‌ని చెప్పుకొచ్చారు. అస‌లు ఆ అమ్మాయి శ‌రీరంలో ఎముక‌లు ఉన్నాయా..? ఆమెలా డ్యాన్స్ చేసే వారిని చూడలేదని ఒక కలలా ఆమె కదులుతుందని ప్ర‌శంస‌లు కురిపించారు. ఇక మ‌హేష్ ప్ర‌శంస‌లు ల‌వ్ స్టోరీ టీమ్‌కు మ‌రింత్ కిక్ ఇచ్చింది.

Share post:

Latest