సినిమా గురించి చెప్పుకుంటే ఆ కిక్కే వేరు: చిరంజీవి

నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లవ్‌ స్టోరి’. కె. నారాయణ్‌ దాస్‌ నారంగ్, పి. రామ్మోహన్‌ రావు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 24న విడుదలకానుంది.ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఆదివారం జరిగిన ‘లవ్‌ స్టోరీ అన్‌ ప్లగ్‌డ్‌’ కార్యక్రమంలో చిరంజీవి మాట్లాడుతూ ‘నారాయణ్‌ దాస్‌గారితో 1980 నుంచి నాకు మంచి సంబంధాలున్నాయి. వారి అబ్బాయి సునీల్‌ నారంగ్‌ తండ్రికి మించిన తనయుడు . ‘లవ్‌ స్టోరీ’ అనగానే చాలా ఆసక్తి కలిగింది ఎందుకంటే ప్రేమకథా చిత్రాలు చూసి చాలా రోజులైంది. నా మిత్రుడు నాగార్జున కొడుకు నాగచైతన్య వెరీ కూల్‌ బాయ్‌.అలాగే గత ఏడాది కరోనా సమయంలో ఏదైనా సినిమాకు సంబంధించి టీజర్ కాని , ట్రైలర్‌ కాని రిలీజ్‌ చేయమంటే ఇంట్లో కూర్చొని హ్యాపీగా ఓ బటన్‌ నొక్కి, దాని గురించి విష్‌ చెబితే అయిపోతుంది. అయితే ఇలా వచ్చి కళాభిమానుల్ని, ప్రేక్షకుల్ని కలుసుకుంటూ ఈ క్లాప్స్‌ వింటూ ఆ సినిమా గురించి చెప్పుకుంటే ఆ కిక్కే వేరు అని హీరో చిరంజీవి అన్నారు.

నా మిత్రుడు ఆమిర్‌ఖాన్, నాగచైతన్య నటించిన ‘లాల్‌ సింగ్‌ చద్దా సినిమా కోసం చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నా. సాయిపల్లవిని తొలిసారి మా వరుణ్‌ తేజ్‌ ఫిదా చిత్రంలో చూశాను. ఆ సినిమా రిలీజ్‌ అయ్యాక వరుణ్‌ వచ్చి, డాడీ డ్యాన్స్‌ ఎలా చేశాను నేను’ అన్నాడు. ‘సారీ రా నేను నిన్ను చూడలేదు.. సాయిపల్లవిని మాత్రమే చూశా’ అన్నాను.నా సినిమాలో చెల్లెలి పాత్ర కోసం సాయిపల్లవిని అడిగారు అయితే తాను కుదరదు అంది నేను కూడా అదే కోరుకున్నా. ఎందుకంటే అంత మంచి డ్యాన్సర్‌తో నేను డ్యాన్స్‌ చేయాలనుకుంటాను కానీ ‘చెల్లెమ్మా’ అని పిలవగలనా? పిలవలేను. నా పక్కన రొమాంటిక్‌ హీరోయిన్‌గా చేయగలిగితే ఓకే. శేఖర్‌ కమ్ముల ఎవరి వద్దా పనిచేయకపోయినా సక్సెస్‌ఫుల్‌ డైరెక్టర్‌ అయ్యాడు. ‘లవ్‌ స్టోరీ’ ప్రేక్షకులను అలరిస్తుందనడంలో నో డౌట్‌’’ అన్నారు. థియేటర్‌లోనే విడుదల చేసేందుకు ముందుకొచ్చిన ‘లవ్‌ స్టోరీ’ నిర్మాతలకు అభినందనలు.ఈ వేడుకకి వచ్చిన చిరంజీవి, ఆమిర్‌ ఖాన్‌గార్లకు థ్యాంక్స్‌. నాగచైనత్య, సాయిపల్లవి, శేఖర్‌ కమ్ములతో పాటు మా ‘లవ్‌ స్టోరీ’ చిత్ర యూనిట్‌కి అభినందనలు’’ అన్నారు కె. నారాయణ్‌ దాస్‌ నారంగ్‌.