సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న లెహరాయి సాంగ్?

అక్కినేని అఖిల్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. ఈ సినిమా అక్టోబర్ 8న థియేటర్లలో విడుదల కానుంది. అయితే సినిమా విడుదల తేది దగ్గర పడుతుండటంతో సినిమా ప్రమోషన్ స్టార్ట్ చేశారు చిత్రబృందం. ఈ సందర్భంగా సినిమాలోని లెహరాయి అనే రొమాంటిక్ సాంగ్ ని విడుదల చేశారు. ఇదివరకే ఈ సాంగ్ కు సంబంధించిన ప్రోమో విడుదల చేసిన చిత్ర బృందం, తాజాగా పూర్తి లిరికల్ సాంగ్ వీడియోను డిలీట్ చేశారు. ఈ పాటను సిద్దు శ్రీరామ్ పాడగా, శ్రీమణి ఈ సాంగ్ ను లిరిక్స్ అందించారు.

ఇక ఈ సినిమాకు సంబంధించిన లెహరాయి సాంగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఈ సినిమాకు సంగీతాన్ని గోపి సుందర్ అందించారు. ఈ సినిమాలో అఖిల్, పూజా హెగ్డే లతోపాటు గా ఈషా రెబ్బా, ఆమని, మురళి శర్మ, వెన్నెల కిషోర్, జయ ప్రకాష్, ప్రగతి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను అరవింద్ సమర్పణలో బన్నివాసు,వాసు వర్మ సంయుక్తంగా నిర్మించారు.

Share post:

Latest