కోలీవుడ్ కమెడియన్ తో హీరోయిన్ కీర్తి సురేష్ సినిమా.. నిజమా..?

September 22, 2021 at 9:35 am

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది కీర్తి సురేష్.. మహానటి సినిమా తరువాత ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలో కనిపించింది ఈ బ్యూటీ. ప్రస్తుతం మహేష్ బాబు తో కలిసి.. సర్కారు వారి పాట సినిమాల్లో నటిస్తున్నది. అలాగే కోలీవుడ్లో కూడా కొన్ని సినిమాల్లో నటిస్తున్నది. మెగాస్టార్ చిరంజీవి బోళా శంకర్ సినిమాలో కూడా నటిస్తోంది.ఈ సినిమాలో చిరంజీవి చెల్లెలు గా నటిస్తున్నది కీర్తి సురేష్.

అసలు విషయానికొస్తే , హీరోయిన్ కీర్తిసురేష్ ఇప్పుడు కమెడియన్ తో కలిసి నటించనున్నట్లు సమాచారం. కోలీవుడ్లో స్టార్ కమెడియన్ గా ఒక వెలుగు వెలుగుతున్న వడివేలు.. తో ఒక సినిమాలో నటిస్తున్నట్లు కూడా ఇప్పుడు ఎక్కువగా ప్రచారం జరుగుతోంది. ఇందులో వడివేలు కి జోడి గా కాకుండా ఆ సినిమాలో ఒక కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం.

Vadivelu Height, Weight, Age, Stats, Wiki and More

డైరెక్టర్ సూరజ్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో వడివేలు.. శేఖర్ అనే పాత్రలో కనిపించనున్నట్లు గా సమాచారం. అయితే ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలు కానుంది. అయితే ఈ సినిమాలో కీర్తి సురేష్ నటిస్తుందా లేదా అనే విషయం త్వరలోనే తెలుస్తోంది.

కోలీవుడ్ కమెడియన్ తో హీరోయిన్ కీర్తి సురేష్ సినిమా.. నిజమా..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts