బాలీవుడ్ లో కాజల్ అగర్వాల్ రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అతి తక్కువ సమయంలోనే ఎన్నో సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాకుండా ఈ ఈ మధ్యనే తన చిన్ననాటి స్నేహితుడు ని పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్నప్పటికీ ఈ బ్యూటీ ఏ మాత్రం తగ్గడం లేదు. పెళ్లి అయిన తరువాత కూడా అదే రీతిలో సినిమాలు చేస్తూ బిజీబిజీగా గడుపుతోంది. ఇక ఇది ఇలా ఉంటే కాజల్ అగర్వాల్ కు టాలీవుడ్ లో ఏ రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకుంటుందో మనకు తెలిసిందే. కానీ బాలీవుడ్ లో మాత్రం కాజల్ అగర్వాల్ రెమ్యూనరేషన్ తక్కువ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

కాజల్ అగర్వాల్ బాలీవుడ్ లో తొలిసారిగా సింగం సినిమాలో నటించింది. ఆ తర్వాత మరొక సినిమాలో అందురాలి పాత్రలో నటించింది. ఖైదీ వలె బాలీవుడ్ లో మరో సినిమాలో అవకాశం అందుకోగా ఆ సినిమాలో కాజల్ నటించే పాత్ర మామూలు పాత్ర అని తెలిసింది. అది కూడా కొంత సమయం వరకే ఆ సినిమాలో నటించనుందని తెలిసింది. దీంతో ఆ సినిమాకు కాజల్ తీసుకునే పారితోషికం 30 లక్షలు అని తెలిసింది. చిన్న పాత్రే అయినప్పటికీ కాజల్ కు బాలీవుడ్ లో మంచి డిమాండ్ ఉంది. కానీ కాజల్ చిన్న పాత్ర తో కూడా అంత తక్కువ పారితోషకం అందుకుంటుంది. ఇక ప్రస్తుతం ఈ విషయం పై టాలీవుడ్ లో టాక్ నడుస్తోంది.

Share post:

Latest