ఎన్టీఆర్ త‌ల్లి శాలిని గురించి ఎవ‌రికీ తెలియ‌ని ర‌హ‌స్యాలు ఇవే!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ త‌ల్లి, నంద‌మూరి హ‌రికృష్ణ భార్య శాలిని బ‌య‌ట ప్ర‌పంచానికి చాలా దూరంగా ఉంటారు. ఎందుకంటే, హ‌రికృష్ణ ఆమెను లీగ‌ల్‌గా పెళ్లి చేసుకోలేద‌ని, స‌హ‌జీవ‌నం మాత్ర‌మే సాగించార‌ని చెబుతారు. చివ‌ర‌కు నంద‌మూరి కుటుంబ‌స‌భ్యులు కూడా అదే చెబుతుంటారు. కానీ.. హ‌రికృష్ణ‌, శాలిని ఎప్పుడు, ఎక్క‌డ‌ క‌లిశారు? అస‌లు వీరి మ‌ధ్య ప్రేమ ఎలా చిగురించింది..? అన్న ర‌హ‌స్యాలు చాలా మందికి తెలియ‌దు.

- Advertisement -

Actor and TDP leader Nandamuri Harikrishna, NTR's son, dies in road accident

అయితే నిజానికి శాలిని ఒక మ్యూజిక్ టీజ‌ర్‌. ఎన్టీఆర్ కుటుంబంలోని పిల్ల‌ల‌కు సంగీత పాఠాలు చెప్పేందుకు శాలిని వ‌చ్చేవారు. ఎన్టీఆర్‌కు చేదోడు వాడోదుగా ఉంటూ హ‌రికృష్ణ ఎక్కువ‌గా ఇంట్లో ఉండ‌డం వ‌ల్ల శాలినితో ప‌రిచ‌యం ఏర్ప‌డింది. ఒక్కోసారి శాలినిని స్వ‌యంగా హ‌రికృష్ణ‌నే త‌న కారులో ఇంటి ద‌గ్గ‌ర దింపేవారు. ఈ క్ర‌మంలోనే వారి ప‌రిచ‌యం కాస్త ప్రేమ మారింది.

Jr. NTR Details: Biography, Physical Stats, Lifestyle, Career & More

అయితే అప్ప‌టికే హ‌రికృష్ణ‌కు లక్ష్మితో పెళ్లి జ‌రిగింది. జానకిరామ్ పుట్టాడు. క‌ళ్యాణ్ రామ్ క‌డుపులో ఉన్న స‌మ‌యంతో.. హ‌రికృష్ణ శాలినీతో వేరే కాపురం పెట్టేశాడు. ఈ విష‌యం ఇంట్లో తెలియ‌డం, ఆమెను మ్యూజిక్‌గా టీచ‌ర్‌గా తొలిగించ‌డం చ‌క‌చ‌కా జ‌రిగాయి. అనంత‌రం హ‌రికృష్ణ‌ను కుటుంబ‌స‌భ్యులంద‌రూ మంద‌లించార‌ట‌. అయిన‌ప్ప‌టికీ ఆయ‌న శాలినితో బంధాన్ని తెంచుకోలేక‌పోయారు. ఇటు శాలిని కూడా ఎవ‌రు ఏమ‌నుకున్నా హ‌రికృష్ణే నా భ‌ర్త‌ని ఉండిపోయార‌ట‌. ఆ క్ర‌మంలోనే శాలినికి జూ.ఎన్టీఆర్ జ‌న్మించాడు. ఈ విష‌యం తెలుసుకున్న సీనియ‌ర్ ఎన్టీఆర్‌.. త‌న‌కు మ‌న‌వ‌డు పుట్టాడ‌ని తెగ సంభ‌ర‌పడ్డార‌ట‌.

Aravinda Sametha actor Jr NTR gets emotional about his father |  Entertainment News,The Indian Express

అంతేకాదు, త‌న మ‌న‌వ‌డికి చేతిలోకి తీసుకుని ముద్దాడి త‌న పేరే పెట్టార‌ట‌. అనంత‌రం మ‌న‌వ‌డిని, శాలినిని ఇంటికి తీసుకువ‌చ్చేయ‌మ‌ని ఎన్టీఆర్‌ చెప్పినా హ‌రికృష్ణ ఎవ‌రైనా ఏమ‌న్నా అనుకుంటారేమో అని వారిని దూరంగానే ఉంచాడ‌ట‌. దాంతో శాలిని కొడుకుతోనే ఒంట‌రిగా జీవింస్తూ తెర వెన‌కే ఉండిపోయారు. అయితే హ‌రికృష్ణ త‌న రెండో భార్య‌గా శాలినిని అంద‌రికీ ప‌రిచ‌యం చేయ‌క‌పోయినా.. ప్రేమ‌ను మాత్రం ఆమెకే పంచార‌ట‌. ఏ క‌ష్టాలు ప‌డ‌కుండా చూసుకున్నార‌ట‌. ఇక ఆ త‌ర్వాత తాత పోలిక‌లు ఉన్న ఎన్టీఆర్ సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన స్టార్ హీరోగా ఎదిగి త‌ల్లిని త‌ల ఎత్తుకునేలా చేశాడు.

Share post:

Popular