సందిగ్దంలో దృశ్యం 2 సినిమా.. అసలు ఏమైందంటే?

టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేష్ తాజాగా నటించిన దృశ్యం 2 సినిమా కూడా ఓటీటీ ప్లాట్ ఫామ్ లో విడుదల చేయాలనుకున్నారనే వార్తలు జోరుగా ప్రచారం సాగుతున్నాయి. ఇటీవల వెంకటేష్ నటించిన నారప్ప సినిమా మాదిరిగానే ఈ దృశ్యం 2 సినిమా కూడా అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేయాలని నిర్మాతలు ఆలోచిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. దసరా తరువాత దృశ్యం 2 ప్రేమ్ కానుందని బలంగానే వార్తలు వినిపిస్తున్న ఈ చిత్రం యూనిట్ మాత్రం ఇంకా సందిగ్ధం లో ఉందట.

నారప్ప సినిమా వాటిలో ఊహించన ఈ విధంగా రెస్పాన్స్ రాకపోవడంతో దృశ్యం 2 నిర్మాతలు ఆలోచనలో పడ్డారట. థియేటర్ అలాగే ఓటీటీ లెక్కలను బేరీజు వేసుకుంటున్నారట. మొదట వచ్చిన దృశ్యం సినిమా సూపర్ హిట్ అవడమే కాకుండా వెంకటేష్ కెరీర్ లో చాలా రోజుల తర్వాత మంచి వసూళ్లు రాబట్టింది. ఇక దృశ్యం 2 సినిమాను థియేటర్లలోనే తీసుకొస్తే బాగుండదని నిర్మాతలు భావిస్తున్నారట. ప్రస్తుతం థియేటర్లకు అభిమానుల రెస్పాన్స్ కూడా బాగానే ఉండటంతో ఆ రకమైన ఆలోచనలో ఉన్నారట. దీంతో ఈ విషయంపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.

Share post:

Latest