డ్రగ్స్ కేసులో.. ఈరోజు ముమైత్ ఖాన్ హాజరు..?

September 15, 2021 at 6:56 am

టాలీవుడ్ లో డ్రగ్స్ కేసులో, మనిలాండరింగ్ విషయంలో సంబంధించి.. కొంతమంది నటులను ఈడీ అధికారులు విచారించడం ఇప్పటికే జరిగింది. ఇక కెల్విన్ తో పాటు.. పూరి జగన్నాథ్-ఛార్మి-రకుల్ ప్రీతిసింగ్ -రవితేజ-రానా-నందు-నవదీప్.. వంటి ప్రముఖ స్టార్స్ ఈడి అధికారులు ప్రశ్నించారు.ఇప్పుడు డాన్సర్, నటి, ముమైత్ ఖాన్ వంతు వచ్చింది.

డ్రగ్స్ కేసు విచారణలో భాగంగా ఈ రోజున ముమైత్ఖాన్ ఈడి అధికారుల ఎదుట హాజరుకాబోతోంది. విచారణకు సంబంధించి ముమైత్ ఖాన్ తన బ్యాంక్ స్టేట్మెంట్ లను తీసుకురావాలని ఈడీ అధికారులు తెలియజేశారు. ఇక 2017 సంవత్సరంలో టాలీవుడ్ డ్రగ్స్ కేసులో.. ఎక్సేంజ్ శాఖ విచారణకు ముమైత్ ఖాన్ హాజరు అయిన సంగతి తెలిసిందే.ఇదే క్రమంలో ఇప్పుడు ఈడి విచారణ కూడా ఎదుర్కొంటున్నారు.

సెప్టెంబర్ 17న తనీష్, సెప్టెంబర్ 22న హీరో తరుణ్ ఈడీ విచారణకు హాజరుకావాల్సి ఉంది. ఇక వీరిద్దరిని ఈడీ అధికారులు ప్రశ్నిస్తే.. ఇంతటితో విచారణ హాజరు కావలసిన నటుల లిస్టు పూర్తి అవుతుంది.కానీ ఆ తర్వాత ఏం చేయబోతున్నారననే విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది. అయితే ఈడీ అధికారులు ఈ సారి ఎవరు పైన చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే.

 డ్రగ్స్ కేసులో.. ఈరోజు ముమైత్ ఖాన్ హాజరు..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts