వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బిగ్బాస్ లో అడుగు పెట్టబోయేది వీరే..?

September 14, 2021 at 10:08 pm

బుల్లితెరపై రియాల్టీ షో గా ప్రసారమవుతున్న బిగ్ బాస్ ప్రేక్షకుల ఆదరణ బాగానే పొందుతోంది. ఇక టాప్ వన్ లో ఈ రియాల్టీ షోనే ఉండడం విశేషం. ఇక ఇందులో సరయు ఎలిమినేట్ అయిన తరువాత.. అందులోకి వైల్డ్ కార్డు ద్వారా కొంతమంది ఎంట్రీ ఇస్తారు అనే వార్త తెగ హల్చల్ చేస్తోంది. కానీ ఎవరిని వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకొస్తారు అనే వార్త ప్రస్తుతం అందరిలో ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది.

మునుపటి సీజన్ లతో పోలిస్తే , ఈ సీజన్ రేటింగ్ లో దూసుకుపోతున్నప్పటికీ స్పాన్సర్లు మాత్రం ఎవరూ రావడం లేదు. కరోనా కారణంగా పెద్ద పెద్ద కంపెనీల స్పాన్సర్లు కూడా కాళీ చేతులను చూపిస్తూ ఉండడంతో ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ,ఎవరిని తీసుకు వస్తే బాగుంటుంది అనే సందిగ్ధంలో పడ్డారు బిగ్బాస్ నిర్వాహకులు. ఇకపోతే ఇప్పటికే స్టార్ మా లో ప్రసారమయ్యే కొన్ని షోలలో నవ్య స్వామి అలాగే ఆమె ఫ్రెండ్ రవి లు యాంకర్గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇక వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వీరిద్దరి జోడిని ప్రవేశపెట్టాలని చూసినప్పటికీ ,పారితోషకం ఇచ్చుకోలేక.. తిరిగి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా సరయు ని రీ ఎంట్రీ ఇప్పించాలని చూస్తున్నట్లు సమాచారం.

Bigg Boss 5 Telugu: Hamida, Lobo, Sarayu Are Enjoying In Smoke Zone

కరోనా కారణంగా ఇప్పటికే కొంత కాలం ఇండస్ట్రీకి దూరంగా ఉన్న వర్షిని ని తిరిగి తీసుకొస్తారా..? అన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.. మొత్తానికి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఎవరు అడుగుపెడతాతో మనం వేచి చూడాల్సిందే.

వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బిగ్బాస్ లో అడుగు పెట్టబోయేది వీరే..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts