తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్ 5లో రెండో వారం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మొదటి వారం సరయు ఎలిమినేట్ కాగా.. మిగిలిన 18 మందీ హౌస్‌లో నిలదొక్కుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే 10వ కంటెస్టెంట్ గా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్ బర్త్‌డే నేడు.
ఈ సందర్భంగా ఆయన ప్రియురాలు, బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్ దీప్తి సునైనాతో బిగ్‌బాస్ లైవ్‌లో `ఐ లవ్ యు` చెప్పించాడు. దాంతో షణ్ముఖ్ ఫుల్ ఖుషీ అయిపోతూ ఇంటి సభ్యులతో అదిరిపోయే స్టెప్పులు వేశాడు. ఇందుకు సంబంధించిన ప్రోమో నెట్టింట వైరల్‌గా మారింది.
కాగా, షణ్ముఖ్ జశ్వంత్, దీప్తి సునయన ప్రేమాయణం గురించి అందరికీ తెలిసిందే. ఎప్పటి నుంచో ప్రేమలో ఉన్న ఈ జంట.. తమ ప్రేమకు గుర్తుగా ఇద్దరు చేతులపై టాటూలు కూడా వేసుకున్నారు. ఇక బిగ్‌బాస్ హౌస్‌లోనూ షణ్ను సునైనా గురించే మాట్లాడుతుండడంతో..త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు అనే కథనాలు వెలువడుతున్నాయి.