బుద్ధి ఉంటే మళ్ళీ సినిమాలు చేయను.. సోషల్ మీడియాలో వేడి పుట్టిస్తున్న రామ్ చరణ్ లేఖ..?

September 16, 2021 at 1:47 pm

టాలీవుడ్ లో హీరో రామ్ చరణ్ ఎంత గొప్ప నటుడు మనందరికీ తెలిసిన విషయమే.. రామ్ చరణ్ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ చూస్తే..తన తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నాడు. ఇక మొదట చిరుత సినిమాతో సినీ ఇండస్ట్రీకి వచ్చిన రామ్ చరణ్ ఆ తర్వాత మగధీర వంటి సినిమాతో ఇండస్ట్రీ రికార్డులు తిరగ రాశాడు. ఆ తర్వాత ఎన్నో వైవిధ్యమైన సినిమాల్లో నటించి తన రేంజ్ను అమాంతం మార్చుకున్నాడు రామ్ చరణ్.

ప్రస్తుతం రామ్ చరణ్..RRR సినిమాల నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే.అంతే కాకుండా తన తండ్రితో కలిసి ఆచార్య సినిమాలు కూడా నటిస్తున్నాడు. రామ్ చరణ్ కెరీర్లోనే ఒక మచ్చగా మిగిలిపోయిన సినిమా వినయ విధేయత రామ చిత్రం. ఈ సినిమా ఎంత ఫ్లాప్ అయిందో మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమా ఎందుకు చేశాడు రా బాబు అనుకునేలా తమ ఫ్యాన్స్ ను డీలా చేశాడు రామ్ చరణ్. అంతేకాకుండా ఆ సినిమాకు సంబంధించి క్షమాపణలు చెబుతూ అభిమానులకు ఒక లేఖ రాశాడు రామ్ చరణ్.

ఇక తన జీవితంలో మొట్టమొదటి సారి లేఖ రాయించిన ఈ సినిమా చేసినందుకు రామ్ చరణ్ బాధపడుతూ ఉంటారు అని ఒకానొక సందర్భంలో తెలియజేశారు అట. ఈ సినిమా కేవలం దర్శకుడి తో ఆయన మొహమాటం కొద్దీ ఈ సినిమాను ఒప్పుకున్నాడని తెలియజేశాడు. ఇక అతనితో బుద్ధి ఉంటే మళ్ళీ సినిమాలు చేయనని తెలియజేశాడు అన్నట్లుగా సమాచారం. ఇదంతా ఒక ప్రముఖ టీవీ చానల్ ద్వారా ఇంటర్వ్యూలో తెలియజేసినట్లు సమాచారం.

బుద్ధి ఉంటే మళ్ళీ సినిమాలు చేయను.. సోషల్ మీడియాలో వేడి పుట్టిస్తున్న రామ్ చరణ్ లేఖ..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts