యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జశ్వంత్, బిగ్ బాస్ ఫేమ్ దీప్తి సునైనా ఎప్పటి నుంచో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. తమ ప్రేమకు గుర్తుగా ఇద్దరు చేతులపై టాటూలు కూడా వేయించుకున్నారు. అయితే బిగ్ బాస్ షోకి వెళ్లి వచ్చిన తరువాత సునైనాతో షణ్ముఖ్ బ్రేకప్ చెప్పుకున్నారంటూ వార్తలు వచ్చినప్పటికీ.. ఓ ఇంటర్వ్యూలో షణ్ముఖ్ సునైనాపై ఎప్పటికీ ప్రేమ పోదని క్లారిటీ ఇచ్చాడు.
సీట్ కట్ చేస్తే.. బిగ్ బాస్ సీజన్ 5లోకి పదో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన షుణ్ముఖ్.. మొదటి వారం పెద్దగా స్క్రీన్‌పై కనిపించకపోయినా, రెండో వారం ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు తెగ ప్రయత్నిస్తున్నాడు. అయితే ఈ రోజు షణ్ముఖ్ బర్త్‌డే. ఈ సందర్భంగా మేకర్స్ ఓ స్పెషల్ ప్రోమోను విడుదల చేశారు. ఇందులో కాజల్.. షణ్ముఖ్ ను `హమీదాలో నీకునచ్చే మూడు విషయాలు ఏంటో చెప్పు` లంటూ ప్రశ్నించింది.
దాంతో తెగ సిగ్గు పడిపోయిన షణ్ముఖ్.. ఏవో విషయాలు చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోనే పక్కనే ఉన్న హమీదా, రవి, లహరిలు సునైనా టాపిక్ తెస్తూ షణ్ముఖ్‌ను ఆటపట్టించారు. ముఖ్యంగా హమీదా `ఇంట్లో నన్ను చూసుకో, బయటకు వెళ్లాక సుపైనాను చూసుకో` అన్నట్లు మాట్లాడింది. ఇక చివర్లో బిగ్‌బాస్ సునైనా చేత లైవ్‌లో ఐలవ్యూ చెప్పించగా..షణ్ముఖ్ ఫుల్ హ్యాపీ అయిపోయాడు. మొత్తానికి ఆకట్టుకుంటున్న ఈ ప్రోమో నెట్టింట వైలర్‌గా మారింది.