వెంకీని ఫాలో అవ్వ‌బోతున్న‌ చిరు..త్వ‌ర‌లోనే ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌..?

ఇటీవ‌ల `నార‌ప్ప‌` సినిమాతో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్న విక్ట‌రీ వెంక‌టేష్‌.. త్వ‌ర‌లోనే దృశ్యం 2తో అల‌రించ‌బోతున్నారు. మ‌రోవైపు వెంకీ డిజిట‌ల్ ఎంట్రీకి కూడా సిద్ధం అయ్యారు. రానాతో క‌లిసి నెట్ ఫ్లిక్స్ కోసం ఈయ‌న ఓ వెబ్ సిరీస్ చేస్తున్నారు. పాపులర్ అమెరికన్ డ్రామా సిరీస్ `రే డోనోవాన్​` ను `రానా నాయుడు` పేరుతో తెలుగులో రీమేక్ చేస్తున్నారు.

- Advertisement -

Victory' Venkatesh reaches 1 million followers on the photo-sharing  platform | Telugu Movie News - Times of India

ఇందుకు సంబంధించిన ఫస్ట్​లుక్​ను బుధవారం విడుదల చేశారు. కరణ్​ అన్షుమాన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌బోతున్న ఈ సిరీస్ త్వ‌ర‌లో సెట్స్ మీద‌కు వెళ్ల‌నుంది. అయితే ఇప్పుడు వెంకీని మెగాస్టార్ చిరంజీవి కూడా ఫాలో అవ్వ‌బోతున్నార‌ట‌.

Happy Birthday Venkatesh Daggubati:Chiranjeevi, Ravi Teja, Mahesh Babu  shower Venky Mama star with best wishes | PINKVILLA

లేటెస్ట్ స‌మాచారం ప్ర‌కారం.. చిరు సైతం ఓ వెబ్ సిరీస్ చేసేందుకు ఇంట్ర‌స్ట్ చూపుతున్నార‌ట‌. ఈ నేప‌థ్యంలోనే అల్లు అరవింద్ ఆహా ఫ్లాట్‌ఫామ్‌లో చిరంజీవి కోసం ఓ వెబ్ సిరీస్‌ను ప్లాన్ చేసినట్టు సమాచారం. ఇక అన్నీ సెట్ అయితే త్వ‌ర‌లోనే చిరంజీవి ఫ్యాన్స్ గుడ్ న్యూస్ వింటారు.

 

Share post:

Popular