స్టార్ట్ అయిన `బిగ్‌బాస్-5`..తొలి కంటెస్టెంట్ ఆ బ్యూటీనే!

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5 అట్ట‌హాసంగా ప్రారంభం అయింది. ఈ సీజ‌న్‌కు కూడా కింగ్ నాగార్జున‌నే హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించ‌బోతుండ‌గా.. ఈ సాయంత్రం 6 గంటలకు స్టార్ మాలో టన్నుల కొద్దీ కిక్ అంటూ అదిరిపోయే ఎంట్రీ ఇచ్చారీయ‌న‌.

Bigg Boss 5 Telugu Live Updates: All set for the launch of Bigg Boss Telugu Season 5 at 6 pm

బిగ్ బాస్ వేదికపైకి డిఫరెంట్ గెటప్ లో వచ్చిన నాగ్‌ తొలుత మిస్టర్ మజ్నులో పాటకు డ్యాన్స్ చేసి అందరినీ అలరించారు. అపై బిగ్ బాస్ హౌస్‌ను కూడా అందిరికీ చూపించేశారు. ఇక తొలి కంటెస్టెంట్‌గా యూట్యూబ‌ర్ సిరి హనుమంత్ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది.

Actress Siri Hanmanth Latest HD Photos | Hey Siri | Siri Hanmanth Photos | Siri Hanumanth - FilmySense | Tollywood Updates | Telugu Movies News | Gossips

బిగ్‌బాస్ స్టేజ్‌పై హోస్ట్ నాగ్‌తో కాసేపు త‌న‌దైన శైలిలో సంద‌డి చేసిన సిరి .. ఆ త‌ర్వాత కుడి కాలు పెట్టి మ‌రీ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. హౌస్‌లో అడుగడుగు చూస్తూ.. ఆనందం వ్యక్తం చేసింది సిరి. బిగ్ బాస్ హౌస్ చాలా బాగుందని.. తనకు చాలా నచ్చిందని చెప్పుకొచ్చింది సిరి. మ‌రి ఈ బ్యూటీ బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను ఏ మేర‌కు ఆక‌ట్టుకుంటుందో చూడాలి.