`భవదీయుడు భగత్‌సింగ్‌`గా ప‌వ‌న్‌..అదిరిపోయిన టైటిల్ పోస్ట‌ర్‌!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, హ‌రీష్ శంక‌ర్ కాంబోలో ఓ చిత్రం తెర‌కెక్క‌బోతున్న విష‌యం తెలిసిందే. సమకాలీన రాజకీయాల అంశాలతో పాటు దేశభక్తి నేపథ్యంలో రూపుదిద్దుకోబోతున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ బ‌డ్జెట్‌తో నిర్మించ‌బోతున్నారు. త్వ‌ర‌లోనే సెట్స్ మీద‌కు వెళ్ల‌బోతున్న ఈ మూవీ నుంచి సూప‌ర్ అప్టేట్ వ‌చ్చింది.

Image

ఈ చిత్రానికి `భవదీయుడు భగత్ సింగ్` అనే టైటిల్ ఖ‌రారు చేసిన‌ట్టు గ‌త రెండు రోజులుగా వార్త‌లు వ‌స్తుండ‌గా.. ఈ విష‌యాన్ని నిజం చేస్తూ మేక‌ర్స్ తాజాగా టైటిల్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. మొన్న పవన్ బర్త్ డే కానుకగా ఇచ్చిన ప్రీ లుక్ పోస్టర్ కి కంటిన్యూస్ గా మొత్తంలుక్ ని రివీల్ చేస్తూ టైటిల్ `భవదీయుడు భగత్‌సింగ్` అని ఎనౌన్స్ చేశారు.

Image

ఇక టైటిల్ పోస్ట‌ర్‌లో హార్లే డేవిడ్ సం బైక్ పై క్లాస్ గా కూర్చిని ఓ చేతిలో మైక్ మరో చేతిలో టీ గ్లాస్ తో పవన్ క్లాసీ లుక్‌లో ద‌ర్శ‌న‌మిచ్చారు. మొత్తానికి అదిరిపోయిన ఈ పోస్ట‌ర్ నెట్టింట వైర‌ల్‌గా మారింది. కాగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టించ‌బోతోంద‌ని టాక్ న‌డుస్తోంది.

Image