సాయి క్షేమంగా ఉన్నాడు.. నరేష్ గారు మీరు ఎప్పుడు ఏం మాట్లాడాలో నేర్చుకోండి : బండ్ల గణేష్!

హీరో సాయి ధరమ్ తేజ్ బైక్ యాక్సిడెంట్ అయిన విషయం అందరికి తెలిసిందే. ప్రస్తుతం ఈయన అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇది ఇలా ఉంటే సాయి ధరమ్ తేజ్ బైక్ యాక్సిడెంట్ వెనుక అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక తాజాగా అందిన సమాచారం మేరకు సాయి ధరమ్ తేజ్ స్పృహ లోకి వచ్చి తన కుటుంబ సభ్యులతో మాట్లాడినట్టు తెలుస్తోంది. ఇక సాయి తేజ్ బైక్ యాక్సిడెంట్ విషయంలో నరేష్ గారు మీరు అలా మాట్లాడకూడదు అంటూ సోషల్ మీడియా వేదికగా బండ్ల గణేష్ ఒక వీడియో షేర్ చేశారు.

- Advertisement -

ఆ వీడియోలో సాయి ధరమ్ తేజ్ కి చిన్న ప్రమాదం జరిగింది. అతను కోలుకొని ముందులాగే సినిమాలు చేస్తారు అలాగే షూటింగులకు కూడా వెళ్తారు అని తెలిపారు. అయితే ఇటువంటి సమయంలో నరేష్ గారు ఇంకా ఎవరెవరో సాయి ధరమ్ తేజ్ మరణించాడని మాట్లాడటం సరికాదని. అయితే బైక్ యాక్సిడెంట్ ముందు నరేష్ గారు మీ ఇంటికి సాయి తేజ్ వచ్చిన విషయం నిజమే, కానీ ఇలాంటి సమయంలో ఇవన్నీ చెప్పడం తప్ప కదా సార్ అంటూ బండ్ల గణేష్ ఘాటుగా స్పందించారు. ఆ పరమేశ్వరుని ప్రార్థించి త్వరగా కోలుకోవాలని, ముందులాగే సంతోషంగా ఉండాలని కోరుకోవాలి తప్ప ఇలాంటి మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎప్పుడు ఇలా మాట్లాడాలో ముందు నేర్చుకోండి సార్ అంటూ నరేష్ వ్యాఖ్యలపై బండ్లగణేష్ స్పందించారు.

Share post:

Popular