అటు చిరు, ఇటు బాల‌య్య‌..మ‌రి త్రిష ద‌క్కేది ఎవ‌రికో..?

త్రిష కృష్ణన్.. ఈ పేరు కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా స‌త్తా చాటిన త్రిష‌.. తెలుగు తెర‌పై క‌నిపించి చాలా కాల‌మే అయింది. అయితే ఇప్పుడు ఈ బ్యూటీ కోసం టాలీవుడ్‌కు చెందిన ఇద్ద‌రు అగ్ర హీరోలు పోటీ ప‌డుతున్నారు. ఆ హీరోలు ఎవ‌రో కాదు మెగాస్టార్ చిరంజీవి, నంద‌మూరి బాల‌కృష్ణ‌. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే..

Trisha Walked Out Of Chiranjeevi Movie Because Of Another Heroine?

చిరంజీవి ప్ర‌స్తుతం చేస్తున్న చిత్రాల్లో `భోళా శంక‌ర్‌` ఒక‌టి. మెహర్‌ రమేష్‌ దర్శకత్వం వ‌హిస్తున్న ఈ చిత్రం `వేదాళం` రీమేక్‌గా తెర‌కెక్క‌బోతోంది. ఈ చిత్రంలో కీర్తి సురేష్ చిరుకు చెల్లెలుగా న‌టిస్తుండ‌గా.. హీరోయిన్‌గా న‌టించాలంటూ మేక‌ర్స్ త్రిష‌ను సంప్ర‌దించార‌ట‌.Trisha Pairing with Balakrishna – Still in the market as a lead actress!

మ‌రోవైపు గోపీచంద్ మాలినేని, బాల‌య్య కాంబోలో ఓ చిత్రం తెర‌కెక్క‌బోతున్న విష‌యం తెలిసిందే. మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలోనూ హీరోయిన్ పాత్ర కోసం త్రిష‌ను అప్రోచ్ అయ్యార‌ట‌. అయితే గ‌తంలో ఈ ఇద్ద‌రి హీరోల‌తోనూ ఆడిపాడిన త్రిష‌.. ఇప్పుడు ఎవ‌రికి ఓకే చెబుతుందా..? ఈమెను ద‌క్కించుకునే హీరో ఎవ‌రు..? అన్న‌ది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

 

Share post:

Latest