స్టార్ హీరో నుండి పిలుపందుకున్న `ఆర్ఎక్స్ 100` డైరెక్ట‌ర్‌..త్వ‌ర‌లోనే..?

`ఆర్ఎక్స్‌ 100` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన‌ డైరెక్టర్ అజయ్ భూపతి.. తొలి సినిమాతోనే సంచ‌ల‌న విజ‌యం సాధించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈయ‌న రెండో చిత్రం `మహాసముద్రం`. శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా.. అదితి రావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా న‌టించిన ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది.

Ajay Bhupathi - IMDb

ఇదిలా ఉంటే.. డైరెక్ట‌ర్ అజ‌య్ భూప‌తికి ఓ స్టార్ హీరో నుండి క‌థ చెప్ప‌మంటూ పిలుపొచ్చింద‌ట‌. ఇంత‌కీ ఈ హీరో ఎవ‌రో కాదు.. కోలీవుడ్ స్టార్ ధ‌నుష్‌. అనువాద చిత్రాల‌తో టాలీవుడ్‌లో త‌న కంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ క్రియేట్ చేసుకున్న ధ‌నుష్.. శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో డైరెక్ట్ తెలుగు మూవీ చేస్తున్న విష‌యం తెలిసిందే.

Dhanush has reintroduced me as hero: Raj Kiran | Bollywood News – India TV

అయితే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ల‌క‌ముందే ధ‌నుష్‌.. అజ‌య్ భూప‌తితో సినిమా చేయాల‌ని ఇంట్ర‌స్ట్ చూపుతున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. అంతేకాదు, రీసెంట్‌గా గోవాలో అజ‌య్ భూప‌తిని క‌లిసి ధ‌నుష్ ఓ మంచి క‌థ చెప్ప‌మని కోరాడ‌ని, ప్ర‌స్తుతం అజ‌య్ భూప‌తి అదే ప‌నిలో ఉన్నాడ‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. మ‌రి ఇదే నిజ‌మైతే త్వ‌ర‌లోనే ధ‌నుష్‌-అజ‌య్ భూప‌తి కాంబోలో తెర‌కెక్క‌బోయే ప్రాజెక్ట్‌పై ప్ర‌క‌ట‌న వ‌స్తుంది.

Share post:

Popular