పాపం ఆ హీరోయిన్ కు ఆ సినిమాకు డబ్బింగ్ చెప్పడానికి 15 రోజులు పట్టిందట?

దేవాకట్టా రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కించిన రిపబ్లిక్ సినిమా కమర్షియల్ కాదు.. డిఫరెంట్ మూవీ. అయితే ఈ సినిమా కోసం 22 రోజులు పని చేశాం, అందులో కేవలం డబ్బింగ్ చెప్పడానికి మాత్రం 15 రోజుల సమయం పట్టింది అంతే డైరెక్షన్ ఎంత పర్ఫెక్ట్ గా వున్నారు అర్థం చేసుకోవచ్చు అని ఐశ్వర్య రాజేష్ అన్నారు. ఐశ్వర్య రాజేష్,సాయి ధరమ్ తేజ్ తాజాగా నటించిన చిత్రం రిపబ్లిక్. జి స్టూడియోస్ సమర్పణలో జె భగవాన్,జె పుల్లా రావు నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఐశ్వర్య రాజేష్ తెలిపిన పలు విషయాలను ఇలా ఉన్నాయి.

కరోనా ఆ సమయంలో ఒకరోజు దేవాకట్ట రాజేష్ కు ఫోన్ చేసి రిపబ్లిక్ డే స్క్రిప్ట్ గంట చెప్పారట. ఆ తర్వాత హైదరాబాద్ కి వచ్చి ఆయన్ని 5,6 గంటల సేపు కథ చెప్పారట.ఆ తర్వాత హీరో హీరోయిన్ క్యారెక్టర్ నుంచి ప్రతి ఒక్క ఈ విషయం గురించి ఎక్స్ ప్లైన్ చేశారట.సినిమా అనేది మన జీవితాల్లో ప్రభావాన్ని చూపిస్తుంటుంది. అందుకే మనం సినిమా చూసినప్పుడు ఏదో ఒక పాయింట్‌కు కనెక్ట్‌ అవుతుంటాం. అలాంటి ఓ బలమైన సినిమా ద్వారా సమాజానికి అవసరమైన ఓ విషయాన్ని వివరిస్తూ తెరకెక్కించారు దేవ కట్టా.తన కెరీర్‌లో రిపబ్లిక్‌ సినిమా బెస్ట్‌ మూవీ అవుతుందని భావిస్తున్నాను.ఇప్పుడున్న హీరోయిన్స్‌లో సమంతగారంటే ఇష్టం. అలాగే అనుష్కగారంటే కూడా ఇష్టం అని తెలిపింది.సౌందర్యగారంటే ఎంతో అభిమానం. ప్రస్తుతం తెలుగు కథలు వింటున్నాను. త్వరలోనే కిరణ్‌ రెడ్డిగారి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తాను. తమిళంలో చాలా సినిమాలు చేస్తున్నాను.

Share post:

Latest