శ్రీవారి సన్నిధిలో టాలీవుడ్ హీరోయిన్ శ్రీయ దంపతులు..?

టాలీవుడ్ అందాల తార శ్రీయ శరన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీ దూరంగా ఉన్నప్పటికీ ఒకానొక సమయంలో హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది. తెలుగు ఇండస్ట్రీలో అగ్ర హీరోల సరసన నటించి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరుచుకుంది. ఇదిలా ఉంటే తాజాగా శ్రీయ తన భర్తతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. మంగళవారం రోజు ఉదయం వీఐపీ దర్శనంలో శ్రీవారిని దర్శించుకున్న శ్రేయ దంపతులను ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు.


దర్శనం అనంతరం శ్రియ మీడియాతో మాట్లాడుతూ కరోనా కారణంగా రెండు సంవత్సరాలుగా స్వామివారిని దర్శించుకుని లేక పోయాను అని తెలిపింది. ఇక ఆమె భర్త ఆండ్రీ కొశ్చేవ్‌ ఆలయం ముందు ఆమెకు ముద్దుపెట్టి తన ప్రేమను వ్యక్తపరిచారు. ఇకపోతే ప్రస్తుతం శ్రియ సినిమాల విషయానికి వస్తే ఈమె రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ సినిమాలో అజయ్ దేవగన్ కు జోడిగా నటిస్తోంది. అలాగే గమనం అనే మల్టీ లాంగ్వేజ్ సినిమాలో కూడా నటిస్తోంది.

Share post:

Latest