తల్లికి సినిమా థియేటర్ గిఫ్ట్ ఇచ్చిన విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే విజయ్ సినిమాలతోపాటు గా వ్యాపారం వైపు కూడా దృష్టి పెట్టాడు. ఇప్పటికే దుస్తుల వ్యాపారం లో దూసుకెళ్తున్న విజయ్ తాజాగా మరొక వ్యాపారంలోకి అడుగు పెట్టారు. తెలంగాణలోని మహబూబ్ నగర్ లో సకల సౌకర్యాలతో భారీ థియేటర్ ను నిర్మించారు. ఈ థియేటర్ కు ఏవీడి ( ఏషియన్ విజయ్ దేవరకొండ ) పేరుతో నిర్మించారు. తాజాగా ఈ థియేటర్ ను ప్రారంభించారు.తన గురువు అయినా శేఖర్ కమ్ములకు కృతజ్ఞతగా అతని దర్శకత్వంలో వచ్చిన లవ్ స్టోరీ సినిమాను మొదటి సారిగా ప్రదర్శించారు.

- Advertisement -

ఇది ఇలా ఉంటే నేడు విజయ్ దేవరకొండ తల్లి మాధవి పుట్టినరోజు సందర్భంగా థియేటర్లో ఆమె దిగిన ఫోటోను షేర్ చేస్తూ హ్యాపీ బర్త్ డే మమ్ములు. ఈ థియేటర్ నీకోసం. నువ్వు ఆరోగ్యంగా ఉంటే నేను మరింత కష్టపడతాను. నీకు మరిన్ని జ్ఞాపకాలు ఇస్తాను అంటూ ట్వీట్ చేశారు. విజయ్ దేవరకొండ సినిమాల విషయానికి వస్తే విజయ్ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ ప్రస్తుతం గోవాలో జరుగుతోంది. దీనితో ఈ థియేటర్ ప్రారంభానికి విజయ్ దేవరకొండ అందుబాటులో లేడు.

Share post:

Popular