బిగ్‌బాస్‌5: ప్రియాంక విష‌యంలో హ‌ర్ట్ అయిన మాన‌స్‌..ర‌విపై ఫైర్‌!

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5 ఇటీవ‌లె స్టార్ట్ అవ్వ‌గా.. మొత్తం 19 మంది కంటెస్టెంట్స్ హౌస్‌లో ఎంట్రీ ఇచ్చారు. మొద‌టి రోజు ప‌రిచ‌యాల‌తో ఖుషీగా సాగిపోగా.. రెండో రోజు నుంచే హౌస్‌లో ర‌చ్చ మొద‌లైంది. కంటెస్టెంట్స్ మధ్య గొడవలు, అల్లర్లు, ఏడుపులు ఓ రేంజ్‌లో నడుస్తున్నాయి. మ‌రోవైపు ల‌వ్ ట్రాక్స్‌ను కూడా బిగ్‌బాస్ హైలైట్ చేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాడు.

Bigg Boss 5 Telugu : ఇద్దరం కలిసి ఒకే సారి చేసుకున్నాం.. ట్రాన్స్ జెండర్ ప్రియాంక సింగ్ | The Telugu News

ఈ క్ర‌మంలోనే రెండో రోజు ట్రాండ్స్ జెండర్ కోటాలో అడుగు పెట్టిన అందాల భామ ప్రియాంక సింగ్.. న‌టుడు మ‌న‌సు ప్రేమ‌లో ప‌డిన‌ట్టు చూపించారు. ఆమె అంద‌రినీ అన్న‌య్య అంటాను కానీ, మ‌న‌స్‌ను మాత్రం అలా పిల‌వ‌న‌ని ఓపెన్‌గానే చెప్పేసింది. దాంతో ఇంటి స‌భ్యులు తెగ ఆట‌ప‌ట్టించారు. ఇక మూడో రోజు టాస్క్‌లో భాగంగా లోబో ఇత‌ర కంటెస్టెంట్స్ ను ఇమిటేట్ చేశారు. ఇందులో భాగంగానే ప్రియాంక సింగ్ కిచెన్‌లో ఉండి వంట చేస్తున్నట్టుగా లోబో నటించేశాడు.

Bigg Boss Telugu 5: Maanas opines Ravi is 'overplaying' on Priyanka's liking for him; says 'he is not the anchor of Bigg Boss' - Times of India

శ్రీరామ చంద్ర, మానస్‌లు అక్కడే అటు ఇటూ తిరుగుతూ సైట్ కొడుతున్నట్టుగా చూపించేశారు రవి, విశ్వ. ముఖ్యంగా మాన‌స్‌లా న‌టించిన ర‌వి కాస్త ఎక్కువ ఓవ‌రాక్ష‌న్ చేశాడు. దాంతో మాన‌స్ హ‌ర్ట్ అయ్యాడు. తనను పదేపదే ప్రియాంక సింగ్‌తో ముడిపెట్టడాన్ని ఇబ్బందిగా ఫీలైన మ‌న‌స్‌..కాజ‌ల్ వ‌ద్ద ర‌విపై ఫైర్ అయ్యాడు. `ఇదేమీ ఆయన హోస్ట్ చేస్తోన్న షో కాదు.. ఈవెంట్ కాదు.. బిగ్ బాస్ ఐదో సీజన్‌కు హోస్ట్ కాదు.. అంతగా ఆ విషయాన్ని లాగాల్సిన అవసరం లేదు. ప్రియాంక చాలా మంచిది. ఆమె అంటే ఓ ఆరాధనభావం ఉంది. అంతే గాని అందరూ అంటున్నట్టుగా లేద‌`ని తేల్చి చెప్పాడు.

Share post:

Popular