హాస్పిట‌ల్ లో బిగ్ బాస్ బ్యూటీ..ఎందుకంటే..?

కోలీవుడ్ నటి యాషిక్ ఆనంద్ ‘బిగ్ బాస్’ రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేసి ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది. కాగా, ఈ భామ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ విషయం తెలుసుకుని సీని ప్రముఖులు, అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. కొద్ది రోజుల కిందట తమిళానాడులోని మ‌హాబ‌లేశ్వ‌రం దగ్గ‌ర జ‌రిగిన కారు యాక్సిడెంట్‌లో యాషిక్ ఆనంద్ తీవ్రంగా గాయపడింది. ఈ యాక్సిడెంట్‌లో యాషిక్ ఫ్రెండ్ భవానీ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.

యాషిక్‌తో పాటు మరో ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ క్రమంలోనే యాషిక్ ఆనంద్ కొద్ది రోజులుగా ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఇటీవల కోలుకున్నట్లు తెలుస్తోంది. ఆమెను డిశ్చార్జ్ కూడా చేయగా, యాషిక్ ఆనంద్ తన ఇంటికి వెళ్లకుండా ఓ నర్సు ఇంటికి వెళ్లినట్లు సమాచారం. తన ఇంటికి వెళ్తే తన స్నేహితురాలు భవానీ జ్ఞాపకాలు వెంటాడుతాయని, అందుకే తెలిసిన నర్సు ఇంటికి వెళ్లానని చెప్తోంది యాషిక్ ఆనంద్. ప్రజెంట్ అక్కడే రెస్ట్ తీసుకుంటోంది యాషిక్ ఆనంద్.

Share post:

Popular