టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ అందరి ముందు పేరు మార్చుకుంటానంటూ సవాల్ చేశాడు. అసలు ఈయన సవాల్ ఎందుకు చేశాడు..? అందుకు కారణం ఏంటీ..? అన్నది తెలియాలంటే లేట్ చేయకుండా మ్యాటర్‌లోకి వెళ్లాల్సిందే. విశ్వక్ సేన్ హీరోగా నరేష్ కొప్పల్లి అనే కొత్త దర్శకుడు తెరకెక్కించిన తాజా చిత్రం `పాగల్`.
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ దిల్ రాజు సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని లక్కీ మీడియా బ్యానర్ పై బెక్కం వేణుగోపాల్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నివేదా పేతురాజ్ హీరోయిన్గా నటించింది. ఈ చిత్రం ఆగస్టు 14న థియేటర్లో విడుదల కాబోతుండగా.. నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వించారు. ఈ ఈవెంట్లో విశ్వక్ మాట్లాడుతూ..ఈ సినిమా కథ చెప్పినప్పుడు నాకు మైండ్ బ్లాక్ అయ్యింది. మీకు ఎవరికీ తెలియదు మేం పెద్ద హిట్ కొడుతున్నాం.
అందరూ ఫ్రైడే సినిమాని విడుదల చేస్తారు.. మేం పాగల్ కదా.. శనివారం రిలీజ్ చేస్తున్నాం. ఇక నన్ను చాలామంది అడుగుతున్నారు.. ఇలాంటి పరిస్థితిల్లో సినిమా విడుదల చేయడం కరెక్టేనా అని అడిగారు.. వాళ్లకి నేను చెప్పేది ఒక్కటే.. సర్కస్‌లో సింహంతో ఎవడైనా ఆడుకుంటాడు.. నేను అడవికి వచ్చి ఆడుకునే టైపు.. మూసుకున్న థియేటర్లు తెరిపిస్తా అమ్మతోడు.. నా పేరు విశ్వక్ సేన్.. సినిమా హిట్ అవ్వడం ఖాయం. అలా జరగకపోతే పేరు మార్చుకుంటా` అంటూ చెప్పుకొచ్చారు. మరి ఫుల్ కాన్ఫిడెంట్‌గా ఉన్న విశ్వక్ హిట్ కొడతాడో..లేదో..తెలియాలంటే శనివారం వరకు వెయిట్ చేయాల్సిందే.