చిరంజీవి `బ్ల‌డ్ బ్యాంక్‌`ను స్థాపించ‌డానికి కారణం ఏంటో తెలుసా?

మెగాస్టార్ చిరంజీవి గొప్ప న‌టుడే కాదు..సామాజిక సేవ‌కుడు కూడా. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన చిరు అంచ‌లంచ‌లుగా ఎదుగుతూ కోట్లాది మంది ప్రేక్ష‌కుల‌ను త‌న అభిమానులుగా మార్చుకున్నాడు. అలాగే తన ఫ్యామిలీ నుంచి ఎంతో మంది హీరోలను ఇండస్ట్రీకి అందిచిన చిరు..ఇప్పుడు సినీ ఇండస్ట్రీకి పెద్దన్నలా వ్యవహరిస్తున్నారు.

Chiranjeevi blood bank receives a great honour | TeluguBulletin.com

మ‌రోవైపు పలు సామాజిక కార్యక్రమాల ద్వారా ఎంతోమందికి అండగా నిలుస్తున్నారు. ముఖ్యంగా చిరంజీవి బ్లడ్‌ బ్యాంక్‌ ద్వారా ఎంతోమంది ప్రాణాలను ర‌క్షిస్తున్నారు. అయితే అస‌లీ బ్లడ్‌ బ్యాంక్‌ ఏర్పాటు చేయాలనే అలోచన చిరుకి ఎలా వచ్చింది..? దీనికి గల కారణాలు ఏంటి..? అన్న‌ది చాలా మందికి తెలియ‌దు. అయితే తాను బ్లడ్‌ బ్యాంకును ఏర్పాటు చేయడానికి గల కారణాన్ని చిరు గతంలో ఇచ్చిన ఓ ఇంటర్యూలో చెప్పారు.

chiranjeevi: Chiranjeevi donates blood and urges fans to come forward to do  the same | Telugu Movie News - Times of India

ఓ రోజు చిరు పేపర్‌ చదువుతుంటే, రక్తం లేక చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారనే వార్త కనిపించింద‌ట‌. ఇంతమంది జనం ఉండి కూడా సరైన సమయానికి రక్తం ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రాకపోవడం ఏంటి అన్న ప్రశ్న చిరును ఎంతగానో తొలచివేసింద‌ట‌. దాంతో ఆ మ‌రుస‌టి రోజే బ్లడ్‌ బ్యాంక్‌ ఏర్పాటు చేయాలని చిరు నిర్ణయించుకున్నార‌ట‌. అలా 1998లో చిరంజీవి బ్లడ్‌ బ్యాంక్‌ను స్థాపించారు. ఆయ‌న‌ ప్రయత్నానికి ఎంతోమంది అభిమానులు సహా సామాన్యులు సైతం కదిలివచ్చారు. అలా వారందరి సహకారంతో ప్ర‌స్తుతం ఎంతో సక్సెస్‌ ఫుల్‌గా బ్లడ్‌ బ్యాంక్‌ను నిర్వహిస్తున్నారు.