తమన్నా వదులుకున్న సినిమాలు ఇవే..!

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొనసాగుతున్న స్టార్ హీరోయిన్ లలో తమన్నా కూడా ఒకరు. ఇక తమన్నా నటించిన బాహుబలి మూవీతో ఆమె క్రేజ్ అమాంతం పాన్ ఇండియా రేంజ్ కి ఎదిగిపోయింది. ఈమె సినీ ఇండస్ట్రీకి వచ్చి చాలా ఏళ్లు అవుతున్నా కూడా ఇంకా ఈ భామ పదహారేళ్ల పడుచు పిల్లలా కనిపిస్తోంది. ఇకపోతే తమన్నా తన సినీ కెరీర్లో వదులుకున్న కొన్ని సినిమాల గురించి తెలుసుకుందాం.

తమన్నా భాటియా దాదాపుగా ఇప్పటి వరకు 50 సినిమాలలో నటించిందట. ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించింది ఈ ముద్దుగుమ్మ. అయితే తనకు వచ్చిన ఎంతో మంచి సినిమా కథలను మిస్ చేసుకుంది ఈ ముద్దుగుమ్మ.

1) తేజ _వెంకటేష్:
తేజ డైరెక్షన్లో వెంకటేష్ తో కలిసి ఒక సినిమా అనౌన్స్ మెంట్ కూడా జరిగింది కానీ ఆ తర్వాత అది ఆగిపోయింది.

2). బాలకృష్ణ:
బోయపాటి డైరెక్షన్ లో బాలకృష్ణతో కలిసి వస్తున్న సినిమా అఖండ.. ముందుగా ఈ సినిమాలో తమన్నా ను అనుకున్నారు.. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈమె సెలెక్ట్ కాలేక పోయింది.

3) స్పైడర్:
మహేష్ బాబుతో కలిసి స్పైడర్ సినిమా లో నటించే అవకాశాన్ని కోల్పోయింది ఈ ముద్దుగుమ్మ.

4) రవితేజ:
రవితేజ తో బెంగాల్ టైగర్ వంటి సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ , ప్రస్తుతం రవితేజ నటిస్తున్న ఖిలాడి సినిమా వదులుకోవాల్సి వచ్చింది.

5). నాగ చైతన్య:
మాధవన్ , నాగచైతన్య కలిసి నటించిన చిత్రాలు సవ్యసాచి. ఈ సినిమా ని కూడా వదులుకోవాల్సి వచ్చింది.

6). రామ్:
హీరో రామ్ సరసన శివం సినిమా లో హీరోయిన్ గా నటించే అవకాశాన్ని వదులుకోవాల్సి వచ్చింది.

ఇక అంతే కాకుండా రాజుగారు గది-3, బెల్లంకొండ శ్రీనివాస్ తో స్పీడున్నోడు, సచిన్ ఆషికి-2 సినిమాకి కూడా ముందుగా ఈమె అనుకున్నారు.