ఎన్టీఆర్ ఖ‌చ్చితంగా సీఎం అవుతాడు..ప్ర‌ముఖ న‌టుడి కామెంట్స్ వైర‌ల్‌!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ సీఎం అవ్వాల‌ని ఆయ‌న అభిమానులే కాదు తెలుగు దేశం పార్టీలో ఉన్న ఎంద‌రో నేత‌లు కోరుకుంటున్నారు. కానీ, వ‌రుస సినిమాల‌తో బిజీ బిజీగా గ‌డుపుతున్న ఎన్టీఆర్ మాత్రం రాజ‌కీయ‌ల వైపే చూడ‌టం లేదు. అయితే తాజాగా ఎన్టీఆర్ ఖ‌చ్చితంగా సీఎం అవుతాడ‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు ప్ర‌ముఖ న‌టుడు.

Tarzan Laxminarayana: Movies, Age, Photos, Family, Wife, Height, Birthday, Biography, Filmography, Upcoming Movies, TV, OTT, Social Media, Facebook, Instagram, Twitter, WhatsApp, Google YouTube & More » CelPox

ఇంత‌కీ ఆయ‌న ఎవ‌రో కాదు.. టాలీవుడ్‌లో క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న టార్జాన్ లక్ష్మీనారాయణ. సుమారు 30 ఏళ్లుగా ఇండస్ట్రీలో కొన‌సాగుతున్న ఈయ‌న తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొని ఎన్నో ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను పంచుకున్నారు. ఈ సంద‌ర్భంగా త‌న వ్య‌క్తిగ‌త విష‌యాల‌ను చెబుతూనే నూటికి నూరు శాతం యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌ను సీఎంగా చూడాల‌ని అనుకుంటున్న‌ట్లు తెలిపాడు.

Did you know how much Jr NTR was paid for his debut film ''Ninnu Choodalani''? | Telugu Movie News - Times of India

అంతేకాదు ఖ‌చ్చితంగా ఆయ‌న సీఎం అవుతాడంటూ ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశాడు టార్జాన్‌. టీడీపీ అంటే తాత గారు స్థాపించిన పార్టీ అంటారని.. ఎన్టీఆర్ తెలంగాణ లేదా ఆంధ్రకు సీఎం కావచ్చని లక్ష్మీనారాయణ చెప్పాడు. దాంతో టార్జాన్ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైర‌ల్‌గా మారాయి.