న‌మ్ర‌త అవేమి ప‌ట్టించుకోదు..కోడ‌లిపై కృష్ణ షాకింగ్ కామెంట్స్..?

సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి, ఒక‌ప్ప‌టి హీరోయిన్‌ నమ్రత శిరోద్కర్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. తెలుగు, హిందీ, క‌న్న‌డ‌, మలయాళ భాష‌ల్లో ప‌లు సినిమాలు చేసిన న‌మ‌త్ర..2005 లో ఫిబ్రవరి 10న మ‌హేష్‌ను ప్రేమ వివాహం చేసుకుని సినీ లైఫ్‌కు గుడ్‌బై చెప్పేసింది. ఇక నమ్రతతో పెళ్లైన తరువాత మహేష్ కెరీర్ గ్రాఫ్ ఓ రేంజ్లో పెరిగింది.

Mahesh Babu reveals the secret for his successful marriage to Namrata  Shirodkar | Telugu Movie News - Times of India

మహేష్ హీరోగానే కాకుండా యాడ్స్ లోనూ అలాగే మల్టీప్లెక్స్ బిజినెస్ కూడా మొదలు పెట్టాడు. అయితే మహేష్ బాబు వ్యాపార ప్రకటనలు, ఇతర బిజినెస్‌లు, రెమ్యూనరేషన్ విషయాలు, జీఎంబీ వ్యవహారాలు అన్నీ కూడా నమత్రే చూసుకుంటుందనే టాక్ వినిపిస్తూ ఉంటుంది. కానీ, నిజానికి న‌మ్ర‌త అవేమి ప‌ట్టించుకోద‌ట‌. ఈ విష‌యాన్ని మ‌హేష్ బాబు తండ్రి, సూప‌ర్ స్టార్ కృష్ణ స్వ‌యంగా తెలిపారు.

Happy Birthday To Superstar Krishna: Family Pours In Wishes On This  Tollywood Legend

తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న కృష్ణ‌.. కొడుకు మ‌హేష్‌, కోడ‌లు న‌మ్ర‌త‌పై ఆస‌క్తిక‌కర వ్యాఖ్య‌లు చేశారు. మహేష్ బాబు వ్యవహారాలన్నీ కూడా నమ్రత చూసుకుంటారని అంతా అంటారు కదా..నిజ‌మేనా? అని ప్ర‌శ్నించ‌గా..అందుకు కృష్ణ స్పందిస్తూ `అలాంటిదేమీ లేదు. నమ్రత ఎప్పుడూ ఇల్లాలి పని మాత్రమే చేస్తుంది. భ‌ర్త‌, పిల్లలు, ఇళ్లు అవే తన ప్రపంచం. సినిమాలు, బిజినెస్ వ్యవహారాలన్నీ కూడా మహేష్ బాబే చూసుకుంటాడు` అని చెప్పుకొచ్చారు.

Share post:

Latest