షారుక్ ఖాన్ కూతురు ఎంత అందంగా ఉందో.. చూశారా?

బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్ గురించి మనందరికీ తెలిసిందే. ఈమె ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ హాట్ టాపిక్ గా నిలుస్తూ ఉంటుంది. ఈమెకు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఫాలోయింగ్ మామూలుగా లేదు. ఈమె ప్రస్తుతం నటనలో శిక్షణ తీసుకొని సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తోంది. అంతేకాకుండా తన కూతురు చదువు అంతా పూర్తి అయిన తరువాత సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుంది అంటూ షారుక్ ఖాన్ తెలిపాడు. ప్రస్తుతం సుహానా ఇంగ్లాండ్ లో చదువుతోంది.

ఈమె చదువు ముగిసిన అనంతరం బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. అలాగే సుహానా బోయా ఖాన్ మూవీ ద్వారా ఎంట్రీ ఇవ్వనున్నట్లు బాలీవుడ్ లో ఈ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ప్రస్తుతం ఈమె పోర్చుగల్ లో విహరిస్తోంది. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయగా ఆ ఫోటోలు కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వక ముందే సోషల్ మీడియాలో ఏమే ఆ రేంజ్ లో ఫాలోయింగ్ ను సంపాదించుకుంది అంటే ఇక ఇండస్ట్రీకి వచ్చాక అంతకు రెట్టింపు ఫాలోయింగ్ పెంచుకుంటుందా లేదా తెలియాలి అంటే వేచిచూడాల్సిందే మరి.