టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం `పుష్ప`. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతోంది. అలాగే ఈ చిత్రం రష్మిక మందన్నా హీరోయిన్గా, మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ విలన్‌గా నటిస్తున్నారు.
నిన్న ఫహాద్ ఫాజిల్ పాత్రను పరిచయం చేస్తూ.. ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇందులో గుండు లుక్‌లో ఫాహాద్ అందరినీ ఆశ్చర్యపరిచారు. భన్వర్ సింగ్ షెకావత్ భయంకరమైన పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఫాహద్ కనిపించబోతోన్నారు. అయితే పాత్రల కోసం గుండు చేయించుకునేవాళ్లు చాలా అరుదుగా ఉంటారు. కానీ, తెలుగులో చేస్తున్న తొలి సినిమాలోనే ఫాహద్ గుండులో దర్శనమిచ్చాడు. దాంతో ఆయనపై అందరూ ప్రశంసలు కురిపించారు.
అయితే ఆయన గుండు వెనక ఉన్న అసలు కథ ఏంటంటే.. ఆయనది నిజమైన గుండు కాదట. ఫాహద్ అవసరమైతే గుండు చేయించుకునే రకమే కానీ.. పుష్ప కోసం ఆయన ఆ సాహసం చేయలేదట. వేరే కమిట్మెంట్లు చాలా ఉండటం వల్ల ఆయన గుండు కొట్టించుకోనని సుకుమార్‌కు చెప్పారట. దాంతో ప్రోస్థెటిక్ మేకప్ ద్వారా ఫాహద్‌ను గుండు లుక్‌లోకి తీసుకొచ్చారట. నిజం గుండే అనిపించేలా భ్రమ కల్పించారట.