టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా ఎట్టకేలకు షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. ఈ సినిమాలో చివరి షెడ్యూల్ కోసం త్రిబుల్ ఆర్ టీమ్ ఆగస్టు మొదటి వారంలో ఉక్రెయిన్ వెళ్ళిన విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్ తాజాగా పూర్తయింది. దీనితో ఎన్టీఆర్ హైదరాబాద్ వచ్చేశారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ విమానాశ్రయంలో ఎన్టీఆర్ క్యాజువల్ లుక్ లో కనిపించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఇదే అలాగే అదేరోజు దర్శకుడు రాజమౌళి కేక్ కటింగ్ ఫొటోస్ వైరల్ గా మారాయి.
ఇకపోతే ఈ ఆర్ఆర్ఆర్ టీమ్ ఆందరూ హైదరాబాద్ కీ వచ్చాక ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉంది.అలాగే ఈ సినిమా రిలీజ్ డేట్ పై నెలకొన్న సస్పెన్స్ కు ఈ ప్రెస్ మీట్ లో తెరపడనుంది. ఇక డివివి ఎంటర్టైన్మెంట్స్ పై డివివి దానయ్య అత్యంత్య ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్, అలియా భట్, ఒలివియా మోరిస్ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, సముద్రకని, రే స్టీవెన్సన్, అలిసన్ డూడీ సహాయక పాత్రలు పోషిస్తున్నారు.అయితే ఒకేసారి ఇద్దరు స్టార్ హీరో లు కలిసి నటిస్తుండటం తో ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.