నా వ‌య‌సేంటి..మీ మాట్లేంటి..అంతాపోయింది అంటున్న రేణు!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాజీ భార్య‌, ఒక‌ప్ప‌టి హీరోయిన్, డైరెక్ట‌ర్‌ రేణు దేశాయ్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. సోషల్‌ మీడియాలో ఎంతో యాక్టీవ్‌గా ఉండే రేణు.. సినిమా అప్‌డేట్స్‌తో పాటు వ్యక్తిగత విషయాలను కూడా సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటారు. అలాగే అప్పుడప్పుడు త‌న ఫాలోవ‌ర్స్‌తో ముచ్చ‌ట్లు కూడా పెడుతుంటుంది.

Pawan Kalyan's ex-wife Renu Desai all set for her acting comeback? - Movies  News

తాజాగా కూడా రేణూ దేశాయ్ ఇన్ స్టాగ్రాం లైవ్‌లోకి వచ్చారు. దాంతో నెటిజ‌న్లు రేణును ర‌క‌ర‌కాల ప్ర‌శ్న‌లు అడిగారు. అన్నిటికీ ఎంతో ఓపిగ్గా స‌మాధానం ఇచ్చిందామె. ఈ క్ర‌మంలోనే కొంద‌రు నెటిజ‌న్లు..మీరు చాలా అందంగా ఉన్నారు, మీ గ్లామర్ రోజురోజుకు పెరుగుతోందంటూ కామెంట్లు చేశారు.

Renu Desai shares an adorable pic with son Akira Nandan, says nothing in  this world can bother me | Telugu Movie News - Times of India

వాటినిపై స్పందించిన రేణు..నా గ్లామర్ ఏంటి? ఏమీ లేదు.. అంతాపోయింది.. అయినా నా వయసు ఏంటీ? మీరు మాట్లాడుతున్నా మాటలేంటి? కానీ మీరు అలా అంటే సిగ్గేస్తోంది అని రేణూ దేశాయ్ నవ్వుతూ సమాధానం ఇచ్చారు. మ‌రోవైపు అకీరా సినీ ఎంట్రీకి సంబంధించిన ప‌లువురు నెటిజ‌న్లు ప్రశ్నలు అడిగ‌గా..అకీరా ఇప్పుడు సినిమాల్లోకి రాడు.. అలాంటి ఉద్దేశ్యం గానీ ఆసక్తి గానీ లేదు. అతను ఇంకా చిన్నపిల్లవాడే అంటూ రేణు స‌మాధానం ఇచ్చారు.

Share post:

Latest