జాతీయజెండా వివాదంలో అడుగుపెట్టిన చరణ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం మెగా మల్టీస్టారర్ ప్రాజెక్ట్ ‘ఆర్ఆర్ఆర్’లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాలో మరో స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా నటిస్తున్నాడు. అయితే ఈ సినిమా రిలీజ్ ప్రస్తుతం చివరిదశ షూటింగ్ జరుపుకుంటోండగా, ఈ సినిమా తరువాత తన నెక్ట్స్ ప్రాజెక్ట్స్‌ను సౌత్ ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో నటించేందుకు రెడీ అయ్యాడు. అయితే ఇప్పటివరకు ఎలాంటి కాంట్రోవర్సీలకు వెళ్లని రామ్ చరణ్ తెలియకుండానే తాజాగా ఓ వివాదంలో చిక్కుకున్నట్లు కనిపిస్తోంది.

నేడు స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని పలు కంపెనీలు భారీ డిస్కౌంట్లు ప్రకటించి కస్టమర్లను తమవైపుకు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే సెల్‌ఫోన్ వ్యాపారంలో ప్రముఖ కంపెనీ అయిన హ్యాపీ మొబైల్స్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వ్యవహరిస్తున్నారు. దీంతో ఈ ప్రత్యేక వేడుకవేళ డిస్కౌంట్‌లకు సంబంధించి ఓ యాడ్ పోస్టర్‌లో ఆయన జాతీయ జెండాను పట్టుకుని కనిపించారు. అయితే ఇక్కడే చరణ్‌కు తెలియని ఓ పొరపాటు జరిగింది. ఆయన పట్టుకున్న జాతీయ జెండాలో అశోక చక్రం లేదు. ఇది చూసిన చాలా మంది చరణ్‌తో పాటు సదరు సెల్‌ఫోన్ కంపెనీ యాజమాన్యాన్ని దుమ్మెత్తిపోస్తున్నారు.

జాతీయ జెండాలో అశోక చక్రం లేకపోవడం ఏమిటని వారు మండిపడుతున్నారు. అయితే విషయం తెలుసుకున్న ఆ కంపెనీ యాజమాన్యం ఈ విషయంపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఓ సంస్థకు చెందిన వ్యాపార ప్రచారంలో జాతీయ జెండాను పోలి ఉన్నవాటిని ఉపయోగించవచ్చని, ఇది చట్టరిత్యా నేరం కాదను వారు వాదిస్తున్నారు. మరి ఈ అంశం ఇక్కడితో ముగుస్తుందా లేక ఇంకా ముదురుతుందా అనేది చూడాలి.

Share post:

Latest