“రాధే శ్యామ్” లో ఆ ఎపిసోడ్ యే మైన్ అట..!

రెబల్ స్టార్ ప్రభాస్ సిల్వర్ స్క్రీన్ మీద కనిపించి చాలా రోజులే అవుతుంది. బాహుబలి తరువాత సాహో సినిమాతో మన ముందుకు వచ్చారు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కుతున్న “రాధే శ్యామ్” సినిమాతో మన ముందుకు రానున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ కి జోడిగా మొట్టమొదటి సారిగా పూజా హేగ్జే నటిస్తుంది. వీళ్ళద్దరి జంట సిల్వర్ స్క్రీన్ పై అదిరిపోయేలా ఉంటుంది అని టాక్. దాదాపుగా ఈ సినిమా షూటింగ్ పూర్తయిపోయినట్లే.

- Advertisement -

ఇంకా రిలీజ్ అవ్వడం మాత్రం ఉంది. అయితే ఈ సినిమా గురించి అందరిలో భారీ అంచనాలు ఉన్నాయి. అంచనాలకు తగ్గట్టుగా సినిమాలో కూడా విజువల్స్ ఎఫెక్ట్స్ భారీగానే ఉంటాయట. ఈ చిత్రానికి సంబంధిన ఒక న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ సినిమాలో ఒక సీన్ కోసం దాదాపు ఇరవై నిమిషాల పాటు పూర్తిగా అదిరిపోయే విజువల్స్ ఎఫెక్ట్స్ ను చిత్రీకరించారట. సినిమాకి అదే హైలైట్ సీన్ అంట. అలాగే ఈ సీన్ లో ప్రభాస్ కూడా ఒక ముఖ్య పాత్రలో ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తారని తెలుస్తుంది. సినిమా రిలీజ్ అయితే గాని తెలియదు ఎంత మేరకు ఈ సినిమాలో విజువల్స్ ఎఫెక్ట్స్ ఉంటాయో అనే విషయం.

Share post:

Popular