బిగ్ బ్రేకింగ్ : `పుష్ప`రిలీజ్ డేట్ అఫీషియల్ అనౌన్స్ మెంట్..!

August 3, 2021 at 1:11 pm

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, సుకుమార్ కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం పుష్ప‌. ఈ చిత్రంలో ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా.. మలయాళీ నటుడు ఫహద్ ఫాజిల్ విల‌న్ పాత్ర పోషిస్తున్నాడు. రెండు భాగాలుగా రాబోతున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ బ‌డ్జెట్ తో పాన్ ఇండియా లెవ‌ల్‌లో తెర‌కెక్కిస్తున్నారు.

Allu Arjun Pushpa video leaked, leaves everyone wanting for more - tollywood

క‌రోనా కార‌ణంగా ఆగిపోయిన ఈ సినిమా.. ఇటీవ‌లె మ‌ళ్లీ సెట్స్ మీద‌కు వెళ్లింది. ఇదిలా ఉండే.. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌పై చిత్ర యూనిట్ బిగ్ అనౌన్స్ మెంట్ ఇచ్చింది. క్రిస్మస్ కానుకగా ఈ చిత్రం మొద‌టి పార్ట్‌ను డిసెంబర్ నెలలో విడుద‌ల‌ చేస్తున్నట్టు తాజాగా మేక‌ర్స్‌ కన్ఫర్మ్ చేశారు.

Image

దీంతో బ‌న్నీ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా, ఈ చిత్రంలో ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో బ‌న్నీ లారీ డ్రైవ‌ర్ పుష్ప‌రాజ్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు.

బిగ్ బ్రేకింగ్ : `పుష్ప`రిలీజ్ డేట్ అఫీషియల్ అనౌన్స్ మెంట్..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts