ప్ర‌భాస్ స‌రికొత్త రికార్డ్‌..ఈయ‌న ముందు ఆ హీరోలు వేస్ట్‌?

రెబ‌ల్ స్టార్ నుండి పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ప్ర‌భాస్‌.. ప్ర‌స్తుతం నాలుగు ప్రాజెక్ట్స్‌తో బిజీ బిజీగా గ‌డుపుతున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ఈయ‌న న‌టించిన రాధేశ్యామ్ చిత్రం విడుద‌ల‌కు సిద్ధంగా ఉండ‌గా.. ఆదిపురుష్‌, స‌లార్ మ‌రియు ప్రాజెక్ట్ కె చిత్రాలు సెట్స్‌పైనే ఉన్నాయి.

- Advertisement -

OMG! Prabhas Let Go Brand Endorsements Worth 150 Crores Due To His Choosy  Nature?

ఇదిలా ఉంటే.. ఇప్ప‌టికే త‌న పేరిట ఎన్నో రికార్డును లిఖించుకున్న ప్ర‌భాస్‌.. తాజాగా మ‌రో రేర్ ఫీట్ అందుకున్నారు. తాజాగా ప్రభాస్.. ఫేస్‌బుక్‌లో ఫాలో అయ్యేవారి సంఖ్య 24 మిలియన్స్ దాటింది. దక్షిణాదిలో ఈ ఫీట్ అందుకున్న ఏకైక హీరోగా రికార్డులకు ఎక్కారు ప్ర‌భాస్‌.

Prabhas Net Worth | Celebrity Net Worth

మరోవైపు దేశ వ్యాప్తంగా టాప్ 10లో 9వ స్థానంలో నిలిచారీయ‌న‌. ఇక ప్ర‌భాస్ ఈ అరుదైన రికార్డును అందుకోవ‌డంతో.. ఆయ‌న అభిమానులు మురిసిపోతున్నారు. అంతేకాదు, త‌మ డార్లింగ్ ముందు మిలిగిన హీరోలు వేస్ట్ అంటూ కొంద‌రు కామెంట్లు పెడుతున్నారు. మ‌రికొంద‌రు, ప్ర‌భాస్‌కు శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు.

Share post:

Popular