సైఫ్ అలీఖాన్‌కు అదిరిపోయే స‌ర్ప్రైజ్ ఇచ్చిన ప్ర‌భాస్!?

బాలీవుడ్ న‌టుడు సైఫ్ అలీఖాన్‌కు రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ అదిరిపోయే స‌ర్రైజ్ ఇచ్చారు. ఈ మధ్య కాలంలో ప్రభాస్ అతిథి మర్యాదల గురించి వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. యూనిట్ సభ్యుల కోసం ప్రత్యేకమైన వంటకాలను చేయించి ప్రభాస్ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా సైఫ్ అలీఖాన్‌ను థ్రిల్ చేశాడు ప్ర‌భాస్‌.

Rebel Star Prabhas to get married in 2020? Here is what his aunt Shyamala  Devi has to say | Telugu Movie News - Times of India

ఆదిపురుష్ సెట్స్ లో సైఫ్ అలీ ఖాన్ కు ప్రభాస్ వివిధ ఆంధ్ర వంటకాలతో విందు ఏర్పాటు చేశాడట. ప్రభాస్ ఇచ్చిన విందుకు సైఫ్ అలీఖాన్ ఫిదా అయిపోయార‌ట‌. మొత్తానికి ప్రభాస్ వంటకాల విందు సైఫ్ అలీ ఖాన్ ద్వారా బిటౌన్ మొత్తం వ్యాపించేసింది.

Adipurush: The third schedule of Prabhas's upcoming film commences today in  Mumbai - Box Office Worldwide

కాగా, ప్ర‌భాస్ ప్ర‌స్తుతం చేస్తున్న భారీ బ‌డ్జెట్ చిత్రాల్లో ఆదిపురుష్ ఒక‌టి. రామాయ‌ణం ఆధారంగా తెర‌కెక్కుతున్న ఈ చిత్రానికి ఓం రౌత్ ద‌ర్శ‌కుడు. ఈ చిత్రంలో ప్ర‌భాస్ రాముడిగా, సౌఫ్ అలీఖాన్ రావ‌ణుడిగా క‌నిపించ‌నున్నాడు. అలాగే కృతి సనన్ ఈ చిత్రంలో ప్ర‌భాస్‌కు జోడీగా న‌టిస్తోంది.