పవన్ కళ్యాణ్ మళ్లీ ఖుషి సెంటిమెంట్ నమ్ముకుంటున్నాడేంటి..?

పవన్ కళ్యాణ్ సినీ కెరియర్ లో హిట్ కొట్టినటువంటి సినిమాల్లో ఖుషి సినిమా కూడా ఒకటి. ఈ సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్ నే మార్చేసింది. ఈ సినిమాను ఎస్.జె.సూర్య డైరెక్షన్లో తెరకెక్కించడం జరిగింది. ఇక ఈ సినిమాలో భూమిక కూడా తన అందంతో ప్రేక్షకులను బాగా మైమరిపించేలా చేసింది. ఈ సినిమా ద్వారానే పవన్ కళ్యాణ్ కూడా క్లాస్ ఆడియెన్స్ మరింత దగ్గరయ్యాడు.

ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ క్రిష్ డైరెక్షన్లో హరిహర వీరమల్లు సినిమాలో నటిస్తున్న సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇక ఈ సినిమాని 2022న సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయాలని చూసినా, అయితే కరోనా కారణంగా షూటింగ్ లన్ని ఆగిపోవడం తో ఈ సినిమాని ఏప్రిల్ 27న విడుదల చేయాలని అనుకున్నారు. అయితే అదే రోజున ఎన్టీఆర్ సినిమా కూడా విడుదల కాబోతున్న ట్లు సమాచారం రావడం జరిగింది.


పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ గురించి కూడా కొన్ని చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్ భీమ్లా నాయక్ లో నటిస్తుండగా, ఈ సినిమా పూర్తి అయిన వెంటనే క్రిష్ డైరెక్షన్లో నటించేందుకు పవన్ కళ్యాణ్ వెళ్తున్నారట. లేదంటే ఒక రోజు ముందుగానే హరిహర వీర మల్లు సినిమాను పవన్ కళ్యాణ్ విడుదల చేస్తారా. .? లేక ఏప్రిల్ 26 న పవన్ కళ్యాణ్ నటించిన ఖుషి మూవీ విడుదల అయింది. కావున అదే రోజున పవన్ కళ్యాణ్ కూడా విడుదల చేస్తాడో వేచి చూడాల్సిందే.

Share post:

Latest