ఓటిటి బాట పట్టిన గోపిచంద్ సినిమా..?

గోపిచంద్ ఏ సినిమా చేసినా కూడా అది ప్రజాధరణను కచ్చితంగా పొందుతుంది. ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్ సినిమాలు చేయడంలో గోపిచంద్ కు ప్రత్యేక స్థానమే ఉంది. తాజాగా గోపిచంద్ సిటీమార్ సినిమాను చేస్తున్నారు. డైరెక్టర్ సంపత్ నంది ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయ్యింది. విడుదలకు సిద్దమైంది. అయితే ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అమెజాన్ ప్రైమ్ సిటీ మార్ సినిమాకు భారీ ఆఫర్ ఇచ్చినట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాగ్రౌండ్ తో తెరకెక్కుతోంది. ఇందులో తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ఇందులో వెన్నెల కిషోర్, సప్తగిరి నటిస్తున్నారంటే అందులో కామెడి ఎలా ఉంటుందో మీరే అర్థం చేసుకోవచ్చు. మూవీలో గోపిచంద్ ఫిమేల్ కబడ్డీ టీమ్ కు కోచ్ గా కనిపించనున్నాడు. మొత్తానికి సంపత్ నంది గోపిచంద్ కు ఈ సినిమాతో హిట్ ఇవ్వడం ఖాయమనేది స్పష్టంగా తెలుస్తోంది.

Share post:

Popular