`స‌లార్‌` నుండి మ‌రో వీడియో లీక్‌..అదిరిన ప్ర‌భాస్ లుక్‌!

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌, డైరెక్ట‌ర్‌ ప్ర‌శాంత్ నీల్ కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం `స‌లార్‌`. హోంబలే ఫిల్మ్స్‌ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా లెవ‌ల్‌లో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఈ మూవీలో శ్రుతి హాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ప్ర‌స్తుతం ఈ మూవీ షూటింగ్ హైద‌ర‌బాద్‌లో శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది.

Salaar release date: Prashanth Neel's Prabhas and Shruti Haasan starrer to  hit screens on April 14, 2022 | Telugu Movie News - Times of India

ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు మొద‌టి నుంచి లీకుల బెడ‌ద త‌ప్ప‌డం లేదు. గ‌తంలో స‌లార్ షూటింగ్ లొకేష‌న్ నుండి ప‌లు ఫొటోలు, వీడియోలు బ‌య‌ట‌కి వ‌చ్చి.. నెట్టింట వైల‌ర్‌గా మారిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడు మ‌రో వీడియో లీక్ అయింది. ఈ వీడియో సినిమాలో సన్నివేశానికి సంబంధించినది కాదు కానీ సాలార్ షూటింగ్ స్పాట్‌లో ప్రభాస్‌కు సంబంధించినది.

Prabhas Salaar look in leaked video - tollywood

తాజాగా లీకైన వీడియోలో ప్ర‌భాస్ స‌లార్ షూటింగ్ స్పాట్‌లో షాట్ చేసేందుకు సూప‌ర్ స్టైలిష్‌గా న‌డిచొస్తూ క‌నిపిస్తున్నారు. ఇక ఈ వీడియో చూసిన అభిమానులు.. ప్ర‌భాస్ లుక్ అదిరిందంటూ కామెంట్ల వ‌ర్షం క‌రిపిస్తున్నారు. మ‌రువైపు లీక్డ్ ఫుటేజ్ పై చిత్ర యూనిట్ సీరియ‌స్‌గా ఉన్న‌ట్టు తెలుస్తోంది.

https://twitter.com/Rupesh_NC/status/1425324707981656065?s=20