థ్రిల్లింగ్‌గా రాహుల్ రామ‌కృష్ణ `NET` టీజ‌ర్!

క‌మెడియ‌న్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న రాహుల్ రామ‌కృష్ణ, అందాల భామ అవికా గోర్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెర‌కెక్కిన తాజా చిత్రం `నెట్‌`. భార్గవ్ మాచర్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ జీ 5 లో సెప్టెంబర్ 10వ తేదీన‌ డైరెక్ట్ స్ట్రీమింగ్ కానుంది.

ఈ చిత్రానికి నరేశ్ కుమ్రన్ సంగీతాన్ని అందించాడు. అయితే తాజాగా ఈ సినిమా టీజ‌ర్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. సర్వీస్ లైన్స్ ఏజెన్సీస్ లో సీసీ కెమెరాలు చెక్ చేసే పని చేస్తూ ఉండే లక్ష్మణ్(రాహుల్ రామ‌కృష్ణ) కు ఒక వీడియో కంటపడుతుంది.

అప్పుడు ఆయన ఏం చేస్తాడు? ఫలితంగా ఎలాంటి ప్రమాదాలను ఎదుర్కొంటాడు? అనేదే కథ అని టీజ‌ర్ బ‌ట్టీ అర్థం అవుతోంది. మొత్తానికి సూప‌ర్ థ్రిల్లింగ్ కొన‌సాగిన ఈ టీజ‌ర్ నెట్టింట వైర‌ల్‌గా మారింది. మ‌రి ఆ టీజ‌ర్‌పై మీరూ ఓ లుక్కేసేయండి.