సినిమాల్లోకి నారా లోకేష్‌..డైరెక్ట‌ర్‌గా తేజ‌..అస‌లు మ్యాట‌రేంటంటే?

మాజీ ముఖ్య‌మంత్రి, టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు ఏకైక తనయుడు నారా లోకేష్ గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న లోకేష్ ప్ర‌స్తుతం ఏపీ రాజ‌కీయాల్లో బిజీ బిజీగా గ‌డుపుతున్నారు. అయితే చాలా మందికి తెలియ‌ని విష‌యం ఏంటంటే.. ఒక‌ప్పుడు లోకేష్ సినిమాల్లోకి రావాల‌ని గ‌ట్టిగా ప్ర‌య‌త్నించార‌ట‌.

Lokesh gives 20-day deadline to YSRCP Government in Guntur Dalit girl  murder case

ఇది ఇప్పటి సంగతి కాదుగానీ.. చంద్ర‌బాబు సీఎంగా ఉన్నప్పుడు 2002లో ఈ దిశగా ప్రయత్నాలు జరిగాయట. 2001లో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ `నిన్ను చూడాలని` చిత్రంతో హీరోగా టాలీవుడ్‌లోకి అడుగు పెట్టాడు. అయితే ఆ త‌ర్వాతి సంవ‌త్స‌ర‌మే లోకేష్‌ను కూడా హీరోగా ప‌రిచ‌యం చేయాల‌నుకున్నార‌ట‌.

Nara Lokesh's debut movie viral on Social Media - SMTV English | DailyHunt

‘జయం’ సినిమాతో సూపర్ హిట్ అందుకొని ఫామ్‌లోకి వ‌చ్చిన‌ తేజ దర్శకత్వంలో.. లోకేష్ తొలి సినిమా ప్లాన్ చేశారట‌. కానీ, ప‌లు కార‌ణాల వ‌ల్ల ఈ చిత్రం ప‌ట్టాలెక్క‌కుండానే ఆగిపోయింది. ఇక‌ లోకేష్ సినిమా విషయం అప్పట్లో సినీ వార్తా పత్రిక సంతోషం కవర్ పేజీపై పెద్ద హెడ్డింగ్ తో ఫొటోల‌తో స‌హా ప్ర‌చురితం అయింది. మొత్తానికి హీరో అవ్వ‌లేక‌పోయిన చిన్న‌బాబు.. తండ్రి బాట‌లోనే రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.

Image

Share post:

Popular