4వ త‌ర‌గ‌తిలో ఫ‌స్ట్ ల‌వ్‌..పెళ్లికి మాత్రం అలాంటివాడే కావాలి: మేఘా ఆకాష్

మేఘా ఆకాష్.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `లై` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన మేఘా ఆకాష్‌.. ఆ వెంట‌నే చల్ మోహన్ రంగ మూవీతో సూప‌ర్ క్రేజ్ సంపాదించుకుంది. ఆ త‌ర్వాత త‌మిళంలో వ‌రుస సినిమాలు చేస్తూ త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఈ బ్యూటీ.. లాంగ్ గ్యాప్ త‌ర్వాత రాజ రాజ చోర మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించి హిట్ అందుకుంది.

Really scary to have my privacy invaded': Petta actress Megha Akash on her  Instagram account being hacked

ఇక ఈమె న‌టించిన మ‌రో చిత్రం `డియర్ మేఘా`. సుశాంత్ రెడ్డి దర్శకత్వం వ‌హించిన ఈ చిత్రంలో అరుణ్ ఆదిత్, అర్జున్ సోమయాజుల హీరోలుగా నటించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబర్ 3న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. అయితే విడుద‌ల ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో చిత్ర యూనిట్ జోరుగా ప్ర‌మోష‌న్స్ నిర్వ‌హిస్తోంది.

Megha Akash (actress) Wiki, Age, Family, Biography, Movies

ఇందులో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మేఘా ఆకాష్ వృత్తిప‌ర‌మైన విష‌యాల‌తో పాటు వ్య‌క్తిగ‌త విష‌యాల‌ను కూడా షేర్ చేసుకుంది. ఈ క్ర‌మంలోనే తనకు కాబోయేవాడి గురించి మాట్లాడుతూ.. `నేను నాలుగో తరగతి చదువుతున్నప్పుడు నా పక్కన కూర్చునే అబ్బాయితో ఫస్ట్ క్రష్ ఏర్పడింది. అది నా ఫస్ట్ లవ్. ఆ తర్వాత షారుక్ ఖాన్ అంటే ఇష్టం ఏర్పడింది. ఇక నాకు కాబోయే వాడు మంచోడు అయి ఉండాలి. నన్ను నాలా ఉండనివ్వాలి. అలాంటి వాడినే నేను ప్రేమించి పెళ్లి చేసుకుంటా` అంటూ చెప్పుకొచ్చింది.

Share post:

Popular