ఎన్టీఆర్ అభిమానిగా మారిన మెగా హీరో..గుర్రుగా ఫ్యాన్స్‌?!

మెగా ఫ్యామిలీ నుంచి వ‌చ్చిన హీరోల్లో ప‌వ‌న్ తేజ్ కొణిదెల ఒక‌రు. కానీ, మెగా అభిమానులు ఇప్ప‌టి వ‌ర‌కు ప‌వ‌న్‌ను ప‌ట్టించుకోలేదనే చెప్పాలి. `ఈ కథలో పాత్రలు కల్పితం` చిత్రంతో ప‌వ‌న్ హీరోగా తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టాడు. అయితే ఈ మూవీ పెద్ద‌గా ఆక‌ట్టుకోలేక‌పోయింది.

- Advertisement -

ఈ నేప‌థ్యంలోనే రెండో చిత్రంతో ఎలాగైనా హిట్ కొట్టాల‌ని ఆశ‌ప‌డుతున్నాడు ప‌వ‌న్‌. ఇక్క‌డ ఆస‌క్తిక‌ర విష‌యం ఏంటంటే.. ప‌వ‌న్ త‌న రెండో సినిమాలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌కు వీరాభిమానిగా క‌నిపించ‌బోతున్నాడ‌ట‌. అయితే ఇది మెగా అభిమానుల‌కు ఏ మాత్రం రూచించ‌డం లేద‌ట‌.

మెగా ఫ్యామిలీ నుంచి వ‌చ్చి.. నంద‌మూరి హీరోకు అభిమానిగా న‌టించ‌డం ఏంటంటూ ప‌వ‌న్‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నార‌ట‌. చాలా కాలం నుంచే మెగా-నందమూరి ఫ్యామిలీల అభిమానుల మధ్య శత్రుత్వం న‌డుస్తోంది. అందుకే ప‌వ‌న్ ఎన్టీఆర్‌కు అభిమానిగా న‌టిస్తుండ‌డంపై మెగా ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నార‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది.

Share post:

Popular