మెగా కాంపౌండ్ లో.. మ్యూజికల్ నైట్..?

టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి అంటే ఎంత గొప్ప పేరు ఉందో మనందరికి తెలిసిందే.ఇక ఈయన పుట్టిన రోజున తన అభిమానులు ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. చిరంజీవి పుట్టిన రోజున కొన్ని సేవా కార్యక్రమాలను కూడా చేశారు చిరంజీవి.ఇక ఈయన గురించి ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. అయితే చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆ రోజంతా మెగా ఇంట్లో సందడి నెలకొంది. అయితే ఇది ఒక రోజే ఆగిపోలేదు ఎన్నో రోజులు జరిగినట్లు సమాచారం. ఆ వివరాలను చూద్దాం.

సినీ ఇండస్ట్రీలో ఉండేటువంటి పెద్దలు చిరంజీవి ఇంటి బాట పట్టారు.పైగా ఆరోజు రాఖి కూడా కావడంతో.. సంబరాలు రెట్టింపయ్యాయి.మెగా ఫ్యామిలీ లో ఉండేటువంటి స్టార్ హీరోలు సైతం ఒకే చోట చేరి సంబరాలు జరుపుకున్నారట.ఆ సంబరాలు ఆ రోజు కే పరిమితం కాకుండా ఆ రోజు నుంచి వారం రోజులపాటు చిరంజీవి పుట్టిన రోజు వారోత్సవాలు జరుగుతూనే ఉన్నాయి అన్నట్లు ఇన్సైడ్ వర్గాల టాక్.

ఇక అంతే కాకుండా ఒకరోజు సింధుని ఆహ్వానించి సత్కరించి పంపారు,ఆరోజున మెగా కాంపౌండ్ లో మ్యూజికల్ నైట్ జరిగిందట.ఇక ఆ రోజున చిరంజీవి నటించిన పాటల కుటుంబసభ్యులంతా స్టెప్పులు వేశారు అన్నట్లు సమాచారం.ఇక ఈ పార్టీకి అక్కినేని నాగార్జున కూడా హాజరు అయ్యారని తెలుస్తోంది.చిరు ఇంట్లో ఏం జరిగినా వారు సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ ఉంటారు.

కానీ ఈ మ్యూజికల్ నైట్ కి సంబంధించి ఎటువంటి వీడియోలు ఫోటోలు ఇంతవరకు బయటకు రాలేదు. అయితే త్వరలో వేల్లు పడతాయేమో వేచిచూడాల్సిందే.

Share post:

Popular