నాని దెబ్బకు భయపడుతున్న లవ్ స్టోరి..?

టాలీవుడ్‌లో ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. ఇప్పటికే రిలీజ్ కావాల్సిన సినిమాలు కరోనా కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. దీంతో ఇటీవల థియేటర్లు తిరిగి తెరుచుకోవడంతో, ప్రస్తుతం టాలీవుడ్‌లో పలు సినిమాలు తమ విడుదల తేదీలను వరుసగా అనౌన్స్ చేస్తూ వస్తున్నాయి. ఈ క్రమంలో గతేడాది రిలీజ్ కావాల్సిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీ ‘లవ్ స్టోరి’ని వినాయక చవితి కానుకగా రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

అయితే ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ విషయంలో చిత్ర యూనిట్ మరోసారి ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 10న ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించగా, అదే తేదీన నేచురల్ స్టార్ నాని నటించిన పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీ ‘టక్ జగదీష్’ కూడా అదే రోజున ఓటీటీలో రిలీజ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ ప్రభావం ఖచ్చితంగా లవ్ స్టోరి చిత్రంపై పడుతుందని ఆ చిత్ర యూనిట్ భావిస్తోందట. ఈ కారణంగా లవ్ స్టోరి చిత్ర రిలీజ్ డేట్ విషయంలో చిత్ర యూనిట్ మరోసారి ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది.

అయితే లవ్ స్టోరి చిత్రాన్ని చెప్పిన తేదీకంటే ముందే రిలీజ్ చేసే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉందట. ఏదేమైనా థియేటర్‌లో రిలీజ్ కాబోతున్న సినిమా కూడా ఓటీటీలో రిలీజ్ కాబోతున్న సినిమా దెబ్బకు రిలీజ్ తేదీని మార్చుకోవాలని చూడటం నిజంగా గమనించాల్సిన విషయం. ఇక ఈ సినిమాలో చైతూకు జోడీగా సాయి పల్లవి నటన అద్భుతంగా ఉండబోతున్నట్లు చిత్ర యూనిట్ అంటోంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసిన సంగతి తెలిసిందే.

Share post:

Latest