ప్ర‌భాస్ అలాంటి వాడ‌ని అనుకోలేదు..కృతి సనన్ షాకింగ్ కామెంట్స్‌!

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం చేస్తున్న చిత్రాల్లో `ఆదిప‌రుష్‌` ఒక‌టి. ఓం రైత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రం రామాయణ ఇతిహాసం ఆధారంగా తెర‌కెక్కుతోంది. ఈ పాన్ ఇండియా చిత్రంలో రాముడిగా ప్ర‌భాస్‌, సీతగా కృతి సనన్‌, లక్ష్మణుడిగా సన్నీసింగ్‌, రావణుడిగా సైఫ్‌ అలీఖాన్‌ నటిస్తున్నారు.

Kriti Sanon sensational comment on Prabhas 'Shyness' - tollywood

ప్ర‌స్తుతం ముంబైలో ఆదిపురుష్ షూటింగ్ వేగంగా జ‌రుగుతోంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న‌ కృతి స‌న‌న్ ప్ర‌భాస్‌పై షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ.. `ప్రభాస్‌ చాలా పొడవుంటాడు. మేమిద్దరం ప్రొఫెషనల్‌ కాస్టూమ్స్‌లో ఉన్నప్పుడు మా జంట చూడ‌ముచ్చ‌ట‌గా ఉంటుంది. మొదటి షెడ్యూల్‌లో తొలిసారి ప్రభాస్‌తో షూటింగ్‌లో పాల్గొన్నాను.

Adipurush': Kriti Sanon in consideration to play the leading role opposite  Prabhas? | Telugu Movie News - Times of India

ఇప్పుడు అతనితో మరో షెడ్యూల్‌ చేయబోతున్నాను. అతను చాలా సరదా వ్యక్తి. మంచివాడు. ఎంతో వినయస్తుడు. భోజన ప్రియుడు. అయితే ప్రభాస్‌ చాలా బిడియస్తుడని, ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడడని అందరూ అనుకుంటారు. కానీ అది నిజమని నేను అనుకోలేదు, అనుకోను. ఎందుకంటే, తను చాలా బాగా మాట్లాడతాడు. అంద‌రితోనూ బాగా క‌లిసిపోతాడు` అని చెప్పుకొచ్చింది. దాంతో ఈమె వ్యాఖ్య‌లు ఇప్పుడు నెట్టింట వైర‌ల్‌గా మారాయి.

Share post:

Latest