ప్లాస్టిక్‌ సర్జరీ చేయించుకున్నా, నాకు ఆహంకారం..కియారా కామెంట్స్ వైర‌ల్‌!

కియారా అద్వానీ.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. మ‌హేష్ బాబు హీరోగా తెర‌కెక్కిన `భరత్ అనే నేను` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ఈ అందాల భామ‌.. మొద‌టి సినిమాతోనే హిట్ అందుకుని సూప‌ర్ క్రేజ్ ద‌క్కించుకుంది. ఆ త‌ర్వాత కియారా వినయ విధేయ రామలో న‌టించిన‌ప్ప‌టికీ.. ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా ప‌డింది.

What Kiara Advani is GUILTY about! - Rediff.com movies

ఇక అప్ప‌టి నుంచీ మ‌రో తెలుగు సినిమా చేయ‌ని కియారా.. త్వ‌ర‌లోనే రామ్ చ‌ర‌ణ్‌-శంక‌ర్ కాంబోలో తెర‌కెక్కుతున్న చిత్రంతో టాలీవుడ్‌లోకి రీ ఎంట్రీ ఇవ్వ‌బోతోంది. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న కియారా.. తనపై వచ్చే నెగెటివ్‌ ప్రచారాన్ని అస్స‌లు ప‌ట్టించుకోన‌ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టింది.

Alia Advani Archives - Instazoon

గతంలో తాను ప్లాస్టిక్‌ సర్జరీ చేయించుకున్నట్లుగా దుష్ప్రచారం చేశారని, అలాగే అనుకున్న విధంగా ఫొటోలకు ఫోజులు ఇవ్వకపోడంతో నాపై అహంకారి అనే ముద్ర కూడా వేసి ప్రచారం చేశారని..అయినా తాను సహనాన్ని కోల్పోలేద‌ని చెప్పుకొచ్చింది. అస‌లు అలాంటి వాటి గురించి ఆలోచించి మనసు పాడు చేసుకోవడం నాకు ఇష్టం ఉండ‌ని, అనవసరమైన విషయాల గురించి ఆలోచిస్తే ఏకాగ్రత దెబ్బతింటుంది..దానివల్ల కెరీర్ రిస్క్ ప‌డుతుంది. అందుకే ఆ త‌ప్పు తాను చేయ‌న‌ని కియారా పేర్కొంది. దాంతో ఇప్పుడు కియారా కామెంట్స్ వైర‌ల్‌గా మారాయి.

Share post:

Latest