గర్భవతిగా కీర్తి సురేశ్‌..పెళ్లి కాకుండానే అలా..?

కీర్తి సురేశ్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `నేను శైలజ` సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ త‌నదైన అందం, అభిన‌యం, న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌కు విప‌రీతంగా ఆక‌ట్టుకుంది. ఇక ఆ త‌ర్వాత మ‌హాన‌టి సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న కీర్తి.. ప్ర‌స్తుతం తెలుగు, మ‌ల‌యాళ, త‌మిళ్ చిత్రాల‌తో బిజీ బిజీగా గ‌డుపుతోంది.

- Advertisement -

Keerthy Suresh on playing mom in 'Penguin', life after 'Mahanati' and more  | The News Minute

హీరోల స‌ర‌స‌నే కాకుండా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు కూడా చేస్తున్న కీర్తి.. ఇప్పుడు గ‌ర్భ‌వ‌తి పాత్రలో న‌టించ‌బోతోంద‌ట‌. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. బాలీవుడ్‌లో కృతి స‌న‌న్ నటించిన‌ ‘మిమీ’ చిత్రం ఓటీటీ వేదిక‌గా విడుద‌లై సూప‌ర్ హిట్‌గా నిలిచిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ చిత్రాన్ని తెలుగుతో రీమేక్ చేయాల‌ని ఓ ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ స‌న్నాహాలు చేస్తోంద‌ట‌. ఇందులో భాగంగానే ఈ చిత్రంలో హీరోయిన్‌గా కీర్తి సురేశ్‌ను ఎంపిక చేశార‌ని.. ఇప్ప‌టికే సంప్ర‌దింపులు కూడా పూర్తి అయ్యాయ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

Movie Review: Mimi -

కాగా, పెళ్లి కాకుండానే ఓ యువతి సరోగసీ ద్వారా గ‌ర్భ‌వ‌తిగా మారే కథాంశంతో తెరకెక్కిన మిమీ సినిమా మంచి విజయం అందుకోవ‌డంతో పాటుగా విమర్శకుల ప్రశసంలు సైతం అందుకుంది. అయితే ఇప్పుడు కృతిసనన్‌ చేసిన గ‌ర్భ‌వ‌తి పాత్రలోనే కీర్తి సురేశ్ న‌టించ‌నుంద‌ట‌. మ‌రి దీనిపై అధికార‌క ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది.

Share post:

Popular