చెప్పు తెగుద్ది ఎదవ..అమెరికా అధ్యక్షుడిపై నిఖిల్‌ ఘాటు వ్యాఖ్య‌లు!

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉన్న ఈ హీరో.. సోస‌ల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే స‌మాజంలో జ‌రుగుతున్న ప‌లు అంశాల‌పై త‌న‌దైన శైలిలో స్పందిస్తుంటాడు. అయితే ఈ సారి ఏకంగా అమెరికా అధ్య‌క్షుడు జో బైడెన్‌ను `చెప్పు తెగుద్ది ఎద‌వ` అంటూ ఏకిప‌డేశాడు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే..

కొద్దిరోజులుగా అఫ్ఘనిస్తాన్ లో దుర్భర్బ పరిస్థితులు నెల‌కొన్న సంగ‌తి తెలిసిందే. అధ్యక్షుడు నిష్క్రమణతో అఫ్గాన్ తాలిబన్స్ ఆధీనంలోకి వెళ్ళింది. ప్రాణ భయంతో ఆ దేశ ప్రజలు ఇతర దేశాలకు పారిపోతున్నారు. ఈ క్ర‌మంలోనే ఎంద‌రో అమాయక ప్రజలు ప్రాణాలు విడుస్తున్నారు. ఇలాంటి త‌రుణంలో జో బైడెన్‌.. తాలిబ‌న్లు ఆఫ్ఘ‌న్‌ ప్రజలందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి సురక్షిత పాలనను అందిస్తే.. ఆర్థిక, వాణిజ్యం సహా అన్ని రంగాల్లో సాయం చేస్తామని పేర్కొన్నాడు. మ‌రోవైపు ఇన్నేళ్లు ఆఫ్ఘానిస్తాన్‌లో తన సైన్యాన్ని ఉంచిన అమెరికా ఇప్పుడు మాత్రం వెనక్కి తీసుకుంటోంది.

దాంతో ఆఫ్ఘనిస్తాన్‌ను కైవసం చేసుకున్న తాలిబన్లను అమెరికా అధ్యక్షుడు సమర్థించినట్టుగా అనిపిస్తోంది. ఈ నేప‌థ్యంలోనే జో బైడెన్‌పై ప‌లువురు నిప్పులు చెరుగుతున్నారు. అలాగే హీరో నిఖిల్ కూడా స్పందిస్తూ అమెరికా అధ్య‌క్షుడిపై ఘాటు వ్యాఖ్య‌లు చేశాడు. `స్వేచ్చాప్రపంచం అనే దానికి ఉదాహరణ అమెరికా.. కానీ అది ఇప్పుడు పోయింది.. 21 ఏళ్లుగా ఎన్నో కష్టాలు పెట్టారు.. ఇప్పుడు ఇలా పారిపోయారు. నువ్ ఇంకెప్పుడైనా ఫ్రీడం గురించి మాట్లాడితే.. జో బైడెన్ చెప్పు తెగుద్ది.. ఎదవ` అని సిద్దార్థ్ ట్వీట్ చేశాడు. దాంతో నిఖిల్ ట్వీట్ వైర‌ల్‌గా మారింది.

https://twitter.com/actor_Nikhil/status/1430532040164663308?s=20

Share post:

Popular